రాష్ట్రీయం

క్రీడలకు అధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట/ సిద్దిపేట అర్బన్ : తెలంగాణ సర్కార్ క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని.. జాతీయ క్రీడల్లో రాణించి, అంతర్జాతీయ క్రీడకారులుగా ఎదగాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. భవిష్యత్‌లో ఏసియన్ గేమ్స్, ఓలింపిక్ గేమ్స్‌లో పథకాలను సాధించి దేశప్రతిష్టను ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. హ్యాండ్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు సిద్దిపేట వేదిక కావటం ఏంతో సంతోషం కల్గిస్తుందన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలో మినీస్టేడీయంలో ఎస్‌జీఎఫ్ హ్యాండ్‌బాల్ జాతీయ స్థాయి క్రీడలను ఎమ్మెల్సీలు ఫారూక్‌హుస్సేన్, సుధాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్‌తో కలసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన్పటికి.. అభివృద్ధిలో దేశంలోనే నెంబర్‌వన్‌గా దూసుకపోతుందన్నారు. సీఎం కేసీఆర్ 14 ఏండ్లు పోరాడీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. ఏన్నో రాష్ట్రాల నుండి క్రీడకారులు తెలంగాణకు వచ్చారని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించాలన్నారు. అదేవిధంగా సిద్దిపేట ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించాలన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడకారులకు అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. క్రీడకారులకు వారి రాష్ట్రాలకు చెందిన భోజనాలతో పాటు, తెలంగాణ ప్రాంతానికి చెందిన నాణ్యమైన భోజనం అందుబాటులో ఉంచామని రుచి చూడాలని సూచించారు. సిద్దిపేటలో ఐదురోజుల పాటు జరిగే జాతీయ క్రీడల్లో క్రీడ ప్రతిభను ప్రదర్శించి విజేతలుగా నిలువాలన్నారు. క్రీడల్లో క్రీడకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చి ఆసియన్ గెమ్స్, ఓలింపిక్ గేమ్స్‌లో భారత తరుపున ప్రాతినిథ్యం వహించి భారత కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని క్రీడకారులను ఉత్తేజ పర్చారు. ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఐదేండ్లలో ఏంతో గణనీయమైన అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. సిద్దిపేట పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతుందన్నారు. సిద్దిపేటకు జమ్ముకాశ్మీర్ నుండి క్రీడకారులు రావటం ఎంతో గొప్ప విషయమన్నారు. హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జాతీయ కోశాధికారి ఆనందీశ్వర్‌పాండే మాట్లాడుతూ సిద్దిపేటలో హ్యాండ్‌బాల్ జాతీయ పోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు. సిద్దిపేట గతంలో కంటే ఇప్పుడు ఏంతో అభివృద్ధి చెందిందన్నారు. సిద్దిపేటలో మంచి క్రీడ వసతులు కల్పించటం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, జేసీ పద్మాకర్, డీఈఓ రవికాంత్‌రావు,ఎస్‌జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాంరెడ్డి, జిల్లా కార్యదర్శి కార్యదర్శి సుజాత, హ్యాండ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జగన్‌మోహన్‌రావు పాల్గొన్నారు.
చిత్రం..జాతీయ హ్యాండ్‌బాల్ పోటీల క్రీడా జ్యోతిని వెలిగిస్తున్న మాజీ మంత్రి హరీష్‌రావు