రాష్ట్రీయం

రిజర్వేషన్లపై తెలుగు రాష్ట్రాల కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: ఆర్ధికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లను కల్పించే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురాగా, ఆ చట్టాన్ని రాష్ట్ర పరిధిలోని విద్యాసంస్థల్లో కూడా అమలు చేసేందుకు వీలుగా ఇరు తెలుగు రాష్ట్రాలూ కసరత్తు ప్రారంభించాయి. అయితే 10 శాతానికి మించి తెలంగాణ రాష్ట్రంలో అమలుచేసేందుకు ఎంత మేరకు వీలుందో అధ్యయనం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీని ఆదేశించారు. ఈ అంశంపై అసెంబ్లీ సమావేశాల అనంతరం మిగిలిన నేతలతోనూ చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం కేంద్రం అమలుచేస్తున్న 10 శాతం రిజర్వేషన్లను పెంచి నిరుపేదలైన ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థులకు రాష్టస్థ్రాయిలోనూ రిజర్వేషన్లు అమలు చేసే అంశంపై కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న రిజర్వేషన్లు తక్షణం కేంద్రీయ విశ్వ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ పాఠశాలలు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌ఈఆర్‌లు, ఇతర జాతీయ సంస్థలకు వర్తించనున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన బిల్లును వివిధ రాష్ట్రాలు అసెంబ్లీల్లో ప్రవేశపెట్టి అమలుచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జార్ఖండ్ అగ్రస్థానంలో నిలిచి కేంద్రం బిల్లును ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. మిగిలిన రాష్ట్రాలు ఈ బిల్లును అమలుచేయాల్సి ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరం నుండే దీనిని అమలుచేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించడంతో పాటు జాతీయ స్థాయి ఉన్నత విద్యా అపెక్స్ కమిటీలకు సైతం బిల్లు అమలుకు వీలుగా సూపర్‌న్యూమరీ సీట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కూడా సూచించింది. ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ బిల్లును ఆమోదించినట్టయితే తక్షణమే విద్యా , ఉపాథి రంగాల్లో రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి.