రాష్ట్రీయం

మూడేళ్లు ఇక్కట్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: ఆంధ్రప్రదేశ్‌కు రానున్న రెండు మూడేళ్లు ఆర్థిక బాధలు తప్పవని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. హైదరాబాద్ సచివాలయంలో గురువారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడారు. 14వ ఫైనాన్స్ కమిషన్ కూడా ఆంధ్రప్రదేశ్‌కు 2019 వరకూ ఆర్థిక లోటు ఉంటుందని చెబుతోందని చంద్రబాబు అన్నారు. 20వేల నుండి 25వేల వరకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగాల భర్తీపై విజయవాడ కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలకోసారి సమావేశమై ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రణాళికాయుతంగా పనిచేయాలని చెప్పారు. మే 1న కార్మిక సదస్సును భారీ ఎత్తున నిర్వహించనున్నట్టు చెప్పారు. జన్మభూమి కమిటీలను పటిష్ఠపరచి ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని, ప్రజాప్రతినిధులు అంతా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. సింగపూర్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రహితంగా తీర్చిదిద్ది, సమర్థవంతమైన పాలన అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా, అన్యాయంగా విభజించారని చంద్రబాబు విమర్శించారు. మిగిలిన రాష్ట్రాలకూ, ఆంధ్రప్రదేశ్‌కు మధ్య తలసరి ఆదాయంలో 35వేల నుండి 45 వేల వరకు వ్యత్యాసం ఉందని అన్నారు. ఫోకస్ అప్రోచ్‌తో వ్యవసాయ దిగుబడులను పెంచగలిగామన్నారు. హార్టికల్చర్, పౌల్ట్రీ, డెయిరీ, ఫిషరీస్, సెరికల్చర్ ద్వారా అధిక ఆదాయం పొందేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి నియోజకవర్గాల వారీ వివరాలతో కొత్త యాప్ తీసుకువస్తామని అన్నారు. రానున్న రోజుల్లో 750, 1000 చదరపు అడుగుల విస్తీర్ణంతో అంగన్‌వాడీ కేంద్రాల భవనాలకు 7.5 లక్షల చొప్పున ఇస్తామని, అవసరమైతే 10 లక్షల వరకూ వెచ్చిస్తామని చెప్పారు.
వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని, ఆరు లక్షల ఇళ్లు ఏడాదిలోగా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసితీరుతామని అన్నారు. ఎప్పటికప్పుడు నిర్మాణ పనులను జియోట్యాగింగ్ ద్వారా పరిశీలించి నిధులను విడుదల చేస్తామని పేర్కొన్నారు. 80 శాతం రహదారుల నిర్మాణం ఏడాదిలోగా పూర్తి చేసి చూపిస్తామని సిఎం అన్నారు.
సిఎంకు సత్కారం
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న చంద్రబాబును పూలమాలలతో ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు సత్కరించారు. అంతకుముందు చంద్రబాబు కాపు కార్పొరేషన్ అధికారులు, నేతలతో సచివాలయంలో సమావేశం అయ్యారు.

చిత్రం సచివాలయంలో గురువారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు