రాష్ట్రీయం

చాసో కథలు అజరామరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: చాసో (చాగంటి సోమయాజులు) కథలు అజరామరాలని ఏపీ నాటక అకాడమీ ఉపాధ్యక్షుడు కందిమళ్ల సాంబశివరావు అన్నారు. గురువారం స్థానిక గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని చాసో భవన్‌లో ఏర్పాటు
చేసిన చాసో స్ఫూర్తి సాహిత్య పురస్కార కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాసో కథల్లో తెలియని ఆర్ద్రత ఉంటుందన్నారు. చాసో రాసిన 40 కథల్లో మానవీయ స్పర్శను స్పృశించారని వివరించారు. తన అనుభవ సారాన్ని, జ్ఞానామృతాన్ని కలగలిపి చాసో కథలు రాయడం వల్ల ఆయన కథల్లో శిల్పం విన్యాసం చేస్తుందన్నారు. జీవితాన్ని బాగా అధ్యయనం చేసిన వ్యక్తి చాసో అని, సూటిగా విశే్లషించడం ఆయన నైజమని వివరించారు.
ఈ సందర్భంగా చాసో స్ఫూర్తి ట్రస్ట్ అధినేత చాగంటి తులసీ, ముఖ్య అతిథుల చేతుల మీదుగా యువ రచయిత వేంపల్లె షరీఫ్‌కు చాసో స్ఫూర్తి సాహిత్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రచయిత వేంపల్లె షరీఫ్ మాట్లాడుతూ ముస్లింలలో ఉన్న భిన్న ఉప కులాల మధ్య జరుగుతున్న సంఘర్షణను కథల రూపంలో తీసుకువచ్చానన్నారు. తాను రాసిన ‘జుమ్మా’ కథకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందన్నారు. కాగా, చాసో స్ఫూర్తి పురస్కారం అందుకోవడం అంతకంటే ఆనందంగా ఉందని వివరించారు.
చాగంటి తులసి మాట్లాడుతూ సమాజంలో ఏ మార్పు రావాలని కథలు రాస్తున్నారో అటువంటి వాటికి ఇక నుంచి చాసో స్ఫూర్తి అవార్డును అందజేస్తామన్నారు. కళాత్మక విలువలు కలిగిన రచనలకే చాసో పురస్కారాన్ని అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విశే్లషకురాలు రెహనా, రచయిత జీఎస్ చలం, తమిళ రచయిత వి.దివాకర్, చీకటి దివాకర్, రచయితలు జగద్ధాత్రి, రామతీర్థ, డాక్టర్ ఎ.గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..చాసో స్ఫూర్తి ట్రస్ట్ అధినేత చాగంటి తులసీ, ముఖ్య అతిథుల చేతుల మీదుగా
చాసో స్ఫూర్తి సాహిత్య పురస్కారాన్ని అందుకుంటున్న యువ రచయిత వేంపల్లె షరీఫ్