రాష్ట్రీయం

బిఆర్‌ఎస్‌కు నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: నగర పర్యావరణ పరిస్ధితులను విధ్వంసం చేసే భవనాల క్రమబద్ధీకరణ స్కీంను (బిఆర్‌ఎస్) అనుమతించమని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 146ను సవాలు చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. జిహెచ్‌ఎంసిలో అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తూ ఈ జీవోకు చేసిన సవరణలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అక్రమ భవనాల నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తూ జీవోలు జారీ చేయడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ ఎప్పటికప్పుడు అక్రమంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించడం తగదన్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ హైకోర్టులు ఉదహరించిన కేసులు, తీర్పులు కోర్టుకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లు సవరణలను ఆమోదించిందన్నారు. ఈ కేసు విచారణను వేసవి తర్వాత వరకు వాయిదావేయాలని కోరారు. ఈ బిల్లుకు సవరణలు చేసినట్లు పత్రికల్లో వచ్చిందని, జిహెచ్‌ఎంసి వెబ్‌సైట్‌లో లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని పిటిషనర్‌కు బిల్లు ప్రతిని అందించాలని ఏజిని ఆదేశించింది. అనుమతి లేకుండా భవనాలను నిర్మించే విధానాన్ని ప్రభుత్వం సమర్ధించదని ఏజి హైకోర్టుకు తెలిపారు. ఎటువంటి భవనాలను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందో తెలియచేస్తూ నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఏజిని ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను మూడు వారాల పాటు వాయిదా వేశారు.