రాష్ట్రీయం

వైకాపాకు వంగవీటి గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: తన తండ్రి, దివంగత శాసనసభ్యులు వంగవీటి మోహనరంగా ఆశయాల సాధనతో పాటు తన ఆకాంక్షలు నెరవేర్చుకోటానికి ఇక ఆంక్షలు లేని ప్రజాప్రయాణం కోసం వైకాపాకు రాజీనామా చేస్తున్నానని పార్టీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ ఆదివారం ప్రకటించారు. ఈమేరకు నేరుగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పదునైన పదాలతో ఆయన ఘాటైన లేఖ రాశారు. అన్నివర్గాల అభిమాన పాత్రుడు, సామాన్యుడి సంఘటితత్వానికి స్ఫూర్తిగా నిలిచిన తన తండ్రి వంగవీటి మోహనరంగా ప్రజాక్షేత్రంలో సామాన్యుల సంక్షేమం, పేదల సంరక్షణ కోసం ప్రాణాలర్పించారని రాధా పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం పోరాడటమే స్వర్గీయ వంగవీటి మోహనరంగా ఆకాంక్షగా పేర్కొన్నారు. మోహనరంగా గతంలో ఓ సందర్భంలో చెప్పిన మాటలను ఈసందర్భంగా తన రాజీనామా లేఖలో ఉటంకించారు. ‘ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే మనస్తత్వం కాదు నాది. పోరాటమే నా ఊపిరి. అణచివేత విధానానికి, దమనకాండకు వ్యతిరేకంగా సర్వ ప్రజాసంక్షేమం కోసం, న్యాయ సంరక్షణ కోసం, వర్గాలకు అతీతంగా ఉద్యమం కొనసాగిస్తాను’ అని తన తండ్రి రంగా తరచూ చెప్పే మాటలు తనలో ఎప్పుడూ మార్మోగుతుంటాయని గుర్తుచేశారు. అందుకే ఆయన గతించి 30ఏళ్లయినా ఈనాటికీ ప్రజల గుండెల్లో నిలిచారని స్పష్టం చేశారు. ఆయన ద్వారా సంక్రమించిన పేదల అభిమాన స్ఫూర్తి, ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా ఆశయాల్ని కొనసాగించే రీతిలో ఆంక్షలు లేని ప్రజాప్రయాణం సాగించాలన్నదే తన ఆకాంక్షగా రాధా తెలిపారు. మీకు ముఖ్యమంత్రి పదవి సాధించాలన్న ఆకాంక్ష ఉంటే పార్టీలోని మా అందరిపై ఆంక్షలు విధించడం ఏమిటంటూ జగన్‌ను రాధా ప్రశ్నించారు. అందుకే ఎలాంటి ఆంక్షలు లేని ప్రజాప్రయాణంతో తన ఆకాంక్షలు నెరవేర్చుకోదలిచానని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈనేపథ్యంలో తాను వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వంగవీటి రాధాకృష్ణ వివరించారు.