రాష్ట్రీయం

కాసుల కోసం కేసీఆర్‌తో జగన్ జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిడేల్ ఫ్రంట్‌లో జగన్ ఎందుకు భాగస్వామి అయ్యారో ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక జలవనరుల శాఖ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రాంతీయ, జాతీయ పార్టీలు కోల్‌కత్తాలో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతమైందని, ఈ ర్యాలీకి బీజేపీ వ్యతిరేక పక్షాలు అన్నీ ఒక వేదిక పైకి వచ్చి ప్రజాఫ్రంట్ ర్యాలీని దిగ్విజయం చేశాయన్నారు. 2019లో దేశానికి కొత్త ప్రధాని వస్తున్నారని, శనివారం జరిగిన భారీ ర్యాలీయే అందుకు నిదర్శనమని దేశ, రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యిందన్నారు. తరువాత అమరావతిలో ప్రజాఫ్రంట్ ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. కోల్‌కతా ర్యాలీకి కేసీఆర్, జగన్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలన్నారు. గతంలో టీఆర్‌ఎస్ పార్టీ జగన్‌ని జైలులో పెడితే జైలుగోడలు కూడా కబ్జా చేస్తారన్న పార్టీతో నేడు చేతులు కలిపారన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు, దిండి ప్రాజెక్టులను రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు నష్టం జరిగేలా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుంటే ప్రశ్నించకుండా కేసీఆర్‌తో చేతులు కలిపి రాష్ట్ర రైతులకు జగన్ అన్యాయం చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఇచ్చే కాంట్రాక్టులు, డబ్బుల కోసం కక్కుర్తిపడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేసీఆర్‌కు జగన్ ప్రేమలేఖలు రాస్తున్నారని విమర్శించారు. గాలేరు - నగరి పూర్తిచేసి కడప జిల్లాకు ముఖ్యమంత్రి నీళ్లు ఇచ్చి 1000 కోట్ల రూపాయల పంట కాపాడారన్నారు. రాబోయే 24గంటల్లో చిత్తూరు జిల్లాకు కూడా నీళ్లు తీసుకెళుతున్నామని, దీంతో దశాబ్దాల కల నెరవేరుతుందన్నారు. నెలాఖరు లోపు వైకుంఠపురం బ్యారేజీ, చోడవరం ప్రాజెక్టు, వంశధార - బహుదూర్ నదుల పనులకు సంబంధించి టెండర్లు పూర్తిచేసే పనుల్లో ఉన్నామన్నారు. గోదావరి - పెన్నా ఫేజ్ వన్ పనులకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాను అడిగిన ప్రశ్నలన్నింటికీ జగన్ సమాధానం చెప్పాలని మంత్రి ఉమా డిమాండ్ చేశారు.