రాష్ట్రీయం

గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా హర్‌ప్రీత్‌సింగ్ బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా హర్‌ప్రీత్‌సింగ్ గురువారం బాధ్యతలు చేపట్టడంతో ఆ స్ధానంలో ఇప్పటి వరకు పని చేసిన డాక్టర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు రాజ్‌భవన్‌లో ఘనంగా వీడ్కోలు పలికారు. గత ఏడేళ్లగా రాజ్‌భవన్‌లో సేవలందించిన రమేష్‌కుమార్ సేవలను గవర్నర్ నరసింహన్ ఈ సందర్భంగా జరిగిన వీడ్కోలు సభలో కొనియాడారు. చాలా క్లిష్టసమయాల్లో మంచి సలహాలు ఇచ్చి తనకు ఎంతో సహకరించిన మంచి అధికారి అని నరసింహన్ అన్నారని గవర్నర్ ప్రెస్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటువంటి అధికారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెళ్లడమంటే ఆయన ఆ ప్రభుత్వానికి గొప్ప అసెట్‌గా గవర్నర్ అభివర్ణించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ నరసింహన్ వంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న గవర్నర్‌తో కలిసి పని చేయడం తన అదృష్టమని అన్నారు. ఆయనతో కలిసి పని చేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా రమేష్‌కుమార్‌ను పలువురు ఘనంగా సన్మానించారు. కాగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేష్‌కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

పుష్కరాల నిర్వహణకు ప్రత్యేక అధికారులు
హైదరాబాద్, మార్చి 31: ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఇద్దరు ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ శాఖ డైరక్టర్‌గా పని చేస్తున్న డె.్ధనుంజయరెడ్డి, పురపాలక శాఖ డైరక్టర్ కె.కన్నబాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.