రాష్ట్రీయం

మళ్లీ ఉల్లి లొల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: రాష్ట్రంలో మళ్లీ ఉల్లిగడ్డల లొల్లి మొదలైంది. నిన్నటిదాకా మార్కెట్‌లో ఉల్లిగడ్డ కొరత ఏర్పడి కిలో వంద రూపాయల దాకా ధర పెరగడంతో వినియోగదారులు ఆందోళనకు దిగితే, వీటి నిల్వలపై తాజాగా ప్రభుత్వం విధించిన ఆంక్షలతో నేడు వ్యాపారులు ఆందోళన చేపట్టారు. రాష్టవ్య్రాప్తంగా రెండు రోజులుగా ఉల్లిగడ్డ వ్యాపారులు అమ్మకాలను నిలిపేసి ఆందోళనకు దిగడంతో మార్కెట్‌లో ఉల్లిగడ్డ కొరత ఏర్పడి కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఉల్లిగడ్డ సాగు తక్కువగా ఉండటంతో పక్క రాష్ట్రం మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వ్యాపారులు అక్రమంగా ఉల్లిని నిల్వ చేసి, కృత్రిమమైన కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఉల్లిగడ్డను మార్కెట్‌లో బ్లాక్ చేయడానికి అవకాశం లేకుండా ప్రభుత్వమే దీని ధరను స్థిరీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గత నెల 4వ తేదీన తెలంగాణ ఆనియన్స్ డీలర్స్ ఆర్డర్ జారీచేసింది. దీని ప్రకారం ఉల్లిగడ్డల వ్యాపారులు తమ కొనుగోలు, అమ్మకాన్ని ముందుగానే అంచనా వేసి లైసెన్సు పొందాల్సి ఉంటుంది. లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునే వ్యాపారులు ఆర్డర్ విలువను అనుసరించి సెక్యూరిటీ డిపాజిట్‌గా డబ్బు చెల్లించాలి. అలాగే దీంతోపాటు విధిగా ఏ రోజుకారోజు కొనుగోలు, అమ్మకం లావాదేవీలను రిజిష్టర్‌లో నమోదు చేసి అధికారులకు చూపాల్సి ఉంటుంది. లావాదేవీలను తప్పుగా చూపితే లైసెన్స్‌కోసం చెల్లించిన ధరావత్తు మొత్తాన్ని జప్తు చేస్తారు.ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నిబంధనల పట్ల ఉల్లి వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోల్‌సేల్ వ్యాపారులు మాత్రమే కాకుండా ఉల్లిగడ్డ విక్రయించే ప్రతి ఒక్కరూ (చిరు వ్యాపారి అయినా) విధిగా లైసెన్సు తీసుకోవాల్సిందేనని జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. మార్కెట్‌లో ఉల్లిగడ్డ కొరతను నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వ్యాపారుల ఆందోళనతో ఉల్లి సంక్షోభానికి దారితీసే అవకాశాలు ఉండటంతో ప్రభుత్వం వెంటనే స్పందించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.