రాష్ట్రీయం

సెలవుపై వెళ్లిన హెచ్‌సియు సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మరోమారు దద్దరిల్లింది. యూనివర్శిటీకి చెందిన 55 మంది సిబ్బంది శుక్రవారం సామూహిక సెలవుపై వెళ్లారు. వారు తమ లేఖల్లో యూనివర్శిటీలోని పరిణామాలను ప్రస్తావించకున్నా, అదే కారణంపై సెలవుపై వెళ్లారని తెలిసింది. మరో పక్క అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు వైస్ ఛాన్సలర్ చాంబర్ వద్ద రోజంతా ధర్నా చేశారు. విద్యార్ధుల ఉద్యమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాను యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. కాగా హెచ్‌సియు విసిని తొలగించాలని కోరుతూ ఈ నెల 13న మహార్యాలీ నిర్వహించాలని విద్యార్ధి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. కేరళకు చెందిన ఎంపిలు ముగ్గుర్ని సామాజిక కార్యకర్త కూడా అయిన తీస్తా సెతల్‌వాద్‌ను క్యాంపస్‌లోకి అనుమతించనందుకు నిరసనగా శుక్రవారం యూనివర్శిటీ అట్టుడికి పోయింది. సెతల్‌వాద్‌ను లోపలికి అనుమతించకపోవడంతో ఆమె మెయిన్ గేట్ వెలుపలే ఉండి విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్ధులు గేటు ఆవల ఉండి ఆమె ప్రసంగాన్ని విన్నారు.
రోహిత్ పరిణామాల అనంతరం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్(ఎస్‌జె జాక్) సభ్యులు సెంట్రల్ యూనివర్శిటీ విసిని తక్షణం తొలగించాలని రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీకి ఒక లేఖరాశారు. ఈ లేఖలో రోహిత్ చట్టాన్ని అమలు చేయాలని, విద్యార్ధులు, బోధన సిబ్బందిపై పెట్టిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
నేడు సిపిడిఆర్ నివేదిక
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఘటనల గురించి మార్చి 30న ప్రజాస్వామిక హక్కుల సమన్వయ సంస్థ (సిపిడిఆర్) నిజనిర్ధారణ కొనసాగించింది. ఈ కమిటీలో మహారాష్టక్రు చెందిన ప్రొఫెసర్ ఆనంద్, ఢిల్లీ ప్రొఫెసర్ డాక్టర్ అజిత తదితరులున్నారు.