రాష్ట్రీయం

పెట్టుబడులకు తైవాన్ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 2: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తైవాన్ అధ్యక్షుడి సలహాదారు మైఖేల్ వాంగ్ నేతృత్వంలోని ఎంటుఐ కన్సార్టియం ప్రతినిధి బృందం శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన క్యాంప్ కార్యాలయంలో సమావేశమయింది. ఆంధ్రప్రదేశ్‌లో పలు పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి తైవాన్ ఆసక్తి కనబరుస్తోంది. ఆయా పరిశ్రమల ఏర్పాటుకు అనువైన క్లస్టర్లను ఈ బృందం పరిశీలించనుంది. రాజధాని ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాంగ్‌కు వివరించారు. తైవాన్ బృందం ఆంధ్రప్రదేశ్‌లో వైద్య పరికరాల పార్క్‌ను ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తోంది. వైద్య, రక్షణ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సిలికాన్ వ్యాలీ ఎంటర్‌ప్రిన్యూర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్రంలో ఐటి, ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు మైఖేల్ వాంగ్‌తో సమన్వయం చేసుకుని పనిచేయాలని ప్రభుత్వ ఐటి సలహాదారు జెఎ చౌదరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తైవాన్‌లో పర్యటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మైఖేల్ వాంగ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాంగ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్కరించారు.

చిత్రం తైవాన్ ప్రతినిధితో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు