రాష్ట్రీయం

భూముల పందేరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 2: రాష్ట్రంలో వివిధ సంస్థలకు, పలు పరిశ్రమలకు భూములను కేటాయిస్తూ శనివారం ఇక్కడ జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లా సత్యవీడులో హీరో కంపెనీకి 600 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ సంవత్సరానికి 18 లక్షల ద్విచక్ర వాహనాలను తయారు చేయనుంది. కడప జిల్లా పుట్లంపల్లి గ్రామంలో వౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ సెంటర్ ఏర్పాటుకు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కర్నూలు జిల్లా కరివేముల మండలం జిల్లేడుబుడకల, కుంకనూరులో నెడ్‌క్యాప్, వర్షిణి విండ్ పవర్ ప్రాజెక్ట్ సంయుక్తంగా నెలకొల్పనున్న పవన విద్యుత్ ప్రాజెక్ట్‌కు 28 ఎకరాల స్థలాన్ని 25 సంవత్సరాల లీజ్‌కు కేటాయించారు. అనంతపురం జిల్లా చాబాల గ్రామంలో నెడ్‌క్యాప్, సమరిన్ జైసల్మార్ విండ్ ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నెలకొల్పనున్న పవన విద్యుత్ ప్రాజెక్ట్‌కు మూడు ఎకరాల భూమిని ఎకరాకు ఐదు లక్షల రూపాయల చొప్పున, 25 ఏళ్ల లీజుకు కేటాయించారు. అనంతపురం జిల్లా కనగానపల్లి గ్రామంలో 62.94 ఎకరాలను ఎకరాకు 2.15 లక్షల రూపాయల చొప్పున, ముత్తకుంట్ల గ్రామంలో 62 ఎకరాలను ఎకరాకు 1.75 లక్షల చొప్పున నెడ్‌క్యాప్, సరయు విండ్ పవర్ లిమిటెడ్ సంయుక్తంగా నెలకొల్పనున్న పవన విద్యుత్ ప్రాజెక్ట్‌కు 25 సంవత్సరాల లీజ్‌కు కేటాయించారు. అనంతపురం జిల్లా జంతలూరు గ్రామంలో సెంట్రల్ యూనివర్శిటీ నిర్మాణానికి 491.23 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణానికి 91.31 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించింది. అనంతపురం జిల్లా తుంగోడు గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్‌కోసం 409.53 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించింది. ఇదే జిల్లాలోని వజ్రకరూర్ మండలం చాబాలలో 37.62 ఎకరాలను, కడమాలకుంటలో 27.67 ఎకరాలను, రాగులపాడులో 21.75 ఎకరాల భూమిని 16.80 మెగా వాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌కు కేటాయించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అంకేపల్లిలో 0.5 ఎకరాలను ఎకరా ఏడున్నర లక్షల రూపాయల చొప్పున కల్యాణ మండపం కోసం కేటాయించారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరంలో ఐఐఎంకు 241 ఎకరాల భూమిని కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. తాడేపల్లిగూడెంలో కడకట్ల, తాడేపల్లిగూడెం, కొండ్రుపోలు గ్రామాల్లోని 172 ఎకరాల భూమిని నిట్‌కు కేటాయించారు.

చిత్రం కేబినెట్ నిర్ణయాలను మీడియాకు
వెల్లడిస్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి