రాష్ట్రీయం

విజయ బాపినీడు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, నిర్మాత, తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు అందించిన కె విజయ బాపినీడు కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాపినీడు, మంగళవారం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. చిత్రపరిశ్రమకు విజయ బాపినీడుగా సుపరిచితమైన ఆయన 1936 సెప్టెంబర్ 22న ఏలూరు శివారు చాటపర్రులో సీతారామస్వామి, లీలావతి దంపతులకు జన్మించారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాల్లో బిఏ వరకూ చదివి కొంతకాలం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేశారు. తరువాత పాత్రికేయుడిగానూ కొద్దికాలం సేవలు అందించారు. గుత్తా బాపినీడు పేరిట పలు రచనల చేశారు. మద్రాసులో బొమ్మరిల్లు, విజయ మాస పత్రికలను ప్రారంభించారు. ఆయన దాదాపు 22 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా చిరంజీవి, శోభన్‌బాబు చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించారు. గ్యాంగ్‌లీడర్, ఖైదీ నెం 786, బిగ్‌బాస్, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇండియన్ ఫిల్మ్, నీలిమ పత్రిలకు సంపాదకునిగానూ వ్యవహరించారు. నటుడు కృష్ణతో కృష్ణగారడీ, రాజేంద్రప్రసాద్‌తో వాలుజడ- తోలుబెల్టు, దొంగకోళ్లు, సీతాపతి చలో తిరుపతి వంటి సినిమాలు తీశారు. విజయబాపినీడు అంత్యక్రియలు గురువారం హైదరాబాద్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.
సీఎంల సంతాపం: విజయ బాపినీడు మృతిపట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె చంద్రశేఖర్ రావు, ఎన్ చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాపినీడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
సినీలోకం కంటతడి: విజయబాపినీడు మరణ వార్తతో తెలుగు సినిమా ప్రపంచం దిగ్బ్రాంతికి గురైంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాత, బ్లాక్‌బస్టర్లు అందించిన దిగ్గజ దర్శకుడు ఇకలేరన్న వార్తతో నటులు, టెక్నీషియన్లు మొత్తం సినిమా లోకం కన్నీటి పర్యంతమయ్యారు. కడసారి చూపుకోసం విజయ బాపినీడు ఇంటివద్ద సినిమా ప్రపంచం క్యూగట్టింది. సీనియర్ నటుడు చిరంజీవి మాట్లాడుతూ ఇవాళ తనకెంతో దుర్దినమన్నారు. బాపినీడు మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నానని, ఆయనతో తన అనుబంధం నిర్మాత, దర్శకుడిలాంటిది కాదని ఆత్మీయ అనుబంధమని గుర్తు చేసుకుంటూ పార్దివ దేహం వద్ద నివాళి అర్పించారు. సీనియర్ నటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ మృధుస్వభావి, గొప్ప వ్యక్తిత్వమున్న బాపినీడు దూరమవ్వడం సినిమా లోకానికి తీరని లోటన్నారు. ఆయన విజయాలకు ఒకే ఒక్క కారణం హార్డ్‌వర్క్ అని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. బాపినీడు మృతిపట్ల మా అధ్యక్షుడు శివాజీరాజా, కెఎస్ రామారావు తదితరులు నివాళి అర్పించి, కుటుంబీకులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.