రాష్ట్రీయం

ఐటీ పాలసీ ఆవిష్కరణ రేపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: రాష్ట్రంలో కొత్తగా రూపొందించిన ఐటీ విధానాన్ని సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది. హైటెక్స్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కనె్వన్షన్ సెంటర్‌లో సోమవారం మూడు గంటలకు జరిగే ఐటీ ఆవిష్కరణ కార్యక్రమంలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి పాల్గొంటారని ఐటీశాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

‘దుమ్ముగూడెం’ చేపట్టం
హైకోర్టుకు ప్రభుత్వం వివరణ
హైదరాబాద్, ఏప్రిల్ 2: జ్యోతిరావుఫూలే దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టును చేపట్టరాదన్న నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఎదుట శనివారం తన వాదనలు వినిపించింది. ఈ ప్రాజెక్టు టెండర్లను ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ నెల్లూరుకు చెందిన ఎన్ డోలేంద్ర ప్రసాద్ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. గత ఏడాది అక్టోబర్ నెలలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పిలిచిన టెండర్లను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షమని, దీనివల్ల తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల సాగునీటి ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. పది కంపెనీలకు టెండర్లు ఖరారు చేసినా ఎటువంటి పనులు చేపట్టలేదని ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొంది. పనితీరుపై ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. టెండర్ల కేటాయింపునకు సంబంధించి విధించిన షరతులను ఏ కంపెనీ పాటించలేదంటూ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును ఉమ్మడి ఆంధ్రలోని ప్రభుత్వం తలపెట్టిందని, కాని రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సాగునీటి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నామని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తమ రాష్ట్ర ప్రయోజనాలు, సాగునీటి ప్రయోజనాలకు అనుగుణంగానే ఎటువంటి నిర్ణయం తీసుకునే హక్కు ఉందని తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. పిటిషనర్ రాజకీయ ప్రయోజనాలతో దాఖలుచేసిన పిటిషన్‌ను తోసిపుచ్చాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును అభ్యర్ధించింది.