రాష్ట్రీయం

వైభవంగా యాదాద్రి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 15: యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం శ్రీ పాంఛరాత్ర ఆగమశాస్త్రానుసారం ప్రధానార్చకులు నంధీగల్ లక్ష్మీనరసింహాచార్యుల పర్యవేక్షణలో యాజ్ఞీకులు అర్చక బృందాలు, పారాయణికుల వైదిక కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారి ఆలయంలో విశే్వక్సేనపూజ, స్వస్తీవాచనం, రక్షాబంధనం, పుణ్యాహావచనం, సాయంత్రం అంకురారోపణం, మృత్సంగ్రహణం కార్యక్రమాల ను శాస్తయ్రుక్తంగా యాజ్ఞీక బృందం నిర్వహించిం ది. నేడు వనివారం ఉదయం ధ్వజారోహణం, వేదపారాయణాలు, సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవ ప్రారంభ కార్యక్రమాల్లో ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.