రాష్ట్రీయం

అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ బదానియా అనుచరుడు సోంబిత్ సింగ్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 2: అంతర్జాతీయ స్థాయి ఎర్రచందనం స్మగ్లర్, హర్యానా రాష్ట్రానికి చెందిన ముఖేష్ బదానియా ముఖ్య అనుచరుడు సోంబిత్ సింగ్‌ను శుక్రవారం రాత్రి కడప జిల్లా పోలీసులు అరెస్టుచేశారు. అదేవిధంగా అంతర్జాతీయ, అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు మరో ఎనిమిది మందిని శనివారం వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేశారు. ఒక ముఠా నుంచి రూ.3కోట్లు విలువచేసే ఎర్రచందనం దుంగలు, ఒక స్కార్పియో, ఆటో, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. బదానియా కొన్ని సంవత్సరాలుగా జిల్లా నుంచి ఎర్రచందనం దుంగలను పట్టుకెళ్లి బొమ్మలు, రుద్రాక్ష మాలలు తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుండగా ఆరు మాసాల క్రితం జిల్లా పోలీసులు హర్యానాలో అరెస్టు చేశారు. అ తర్వాత బదానియాకు అత్యంత సన్నిహిత అనుచరుడుగా ఉంటూ వ్యాపార లావాదేవీల్లో సంబంధాలు ఉన్న సోంబిత్ సింగ్ హైదరాబాద్‌లో మకాం వేసి ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ చేస్తున్నాడు. సోంబిత్ సింగ్ శుక్రవారం రాత్రి కడప జిల్లా బద్వేలుకు రాగా, పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అలాగే శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డాగా మారిన వాగేటికోన సమీపంలో పోలీసులు శనివారం ఉదయం కూంబింగ్ చేపట్టి 105 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.3కోట్లు పైబడే ఉంటుందని నిర్ధారించారు. ఆ సమయంలో వందలాది మంది ఎర్రకూలీలు, కొంతమంది స్మగ్లర్లు పారిపోగా ఎనిమిది మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన మంజుకుట్టి, హేమకుమార్, నటరాజ్‌తోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన ఏ.వెంకటేశ్వర్లు, ఎల్.వెంకటేసులు, రైల్వేకోడూరు ప్రాంతానికి చెందిన నరసింహులు, నవీన్‌కుమార్‌లుగా గుర్తించారు. ఈ ముఠాకు అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.