రాష్ట్రీయం

రక్షిత అటవీ ప్రాంతాల కారిడార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: జిల్లాల్లో ఉన్న రక్షిత అటవీ ప్రాంతాలన్నింటిని కలుపుతూ భారీ కారిడార్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. అడవులు, వన్యప్రాణుల పరిక్షణ ప్రధాన బాధ్యతగా ఉన్న ఈ శాఖ రానున్న రోజుల్లో జాతీయ అటవీ విధాన లక్ష్యాన్ని నేరవేర్చేదిశగా రక్షిత అటవీ ప్రాంతాలన్నింటిని కలుపుతూ ప్రత్యేక కారిడార్ రూపొందించాలని ప్రతిపాదించింది. రాష్ట్రంలో 12 రక్షిత అటవీ ప్రాంతాలు, 7 అభయారణ్యాలు, 3 జాతీయ పార్కులు ఉన్నాయి. వీటిని పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా మార్చుకునేందుకు గత బడ్జెట్‌లో కన్నా 2016-17 వార్షిక బడ్జెట్‌లో నిధులను అధికంగా కేటాయించింది. ప్రణాళిక, ప్రణాళికేత బడ్జెట్‌ల కింద మొత్తం రూ.272 కోట్ల ప్రతిపాదనలు చేసింది. దీంతో పాటు అటవీ సంపద, పచ్చదనం కింద ప్రస్తుతం ఉన్న 24 శాతం విస్తీర్ణాన్ని భౌగోళిక ప్రాంతంలో 33 శాతానికి పెంచే విధంగా కార్యాచరణ రూపొందించింది. తద్వారా రిజర్వు అటవీ ప్రాంతానికి వెలుపల గల ప్రాంతంలో చెట్ల పెంపకాన్ని చేపట్టి హరిత వనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా 12 రక్షిత అటవీ ప్రాంతాలకు ఏటూరు నాగారం, పాకాల, కినె్నరసాని వన్యప్రాణుల అభయారణ్యాలను కారిడార్‌ల ద్వారా అనుసంధానం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
మహారాష్టల్రోని తాదోభా అంధారి టైగర్ రిజర్వు, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వులను కావల్ రిజర్వులకు అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. జంటనగరాల చుట్టూ ఆరు ప్రకృతి పార్కులను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు చేయూతనివ్వాలని కూడా నిర్ణయించింది. జిల్లాల్లోని పెద్ద పట్టణాల చుట్టు అటవీ బ్లాకులను ప్రకృతి పార్కులుగా, థీమ్ పార్కులుగా, పట్టణ వనాలుగా అభివృద్ధి చేయబోతోంది. అడవుల సంరక్షణే కాకుండా జీవ వైవిధ్యాన్ని సంరక్షించేందుకు నియమావళిని రూపొందించి అమలు చేస్తోంది.
దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఓక్కో బయోడైవర్శిటీ పార్కును ఏర్పాటు చేయాలని 2016-17 బడ్జెట్‌లో ప్రతిపాదించింది. రాష్ట్రంలో ఉన్న జీవవైవిధ్య మండలి ద్వారా జీవవైవిద్యాన్నిరక్షించడం, పెంపుడు జంతు జాతులు, సూక్ష్మ జీవరాశుల సంరక్షణ వంటి కార్యక్రమాలను మండలి ద్వారా చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.