రాష్ట్రీయం

రాష్ట్ర, దేశ శ్రేయస్సుకు రాజాశ్యామల యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), ఫిబ్రవరి 17: ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోరిక మేరకు ఆ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు, ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రాజాశ్యామల యాగం చేశామని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని పరిస్థితులను కూలంకషంగా అవగాహన చేసుకున్న తాను ఇటు రాష్ట్ర, అటు దేశ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అద్భుతమైన ఫలితాలనిచ్చే రాజాశ్యామల యాగం చేస్తానని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. ఆదివారం నగరానికి సమీపంలోని గోరంట్ల అన్నపూర్ణ నగర్‌లో శ్రీ వేంకటేశ్వరస్వామి రిలీజియస్ సొసైటీ ఆధ్వర్యాన జరుగుతున్న సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా భక్తులనుద్దేశించి స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ రాష్ట్రంలో రానున్న కాలంలో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయన్నారు. ధర్మానికి పూర్తిగా విఘాతం కలుగుతుందని చెప్పారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇవన్నీ ఆలోచించిన తాను రాష్ట్ర ప్రజల క్షేమం, తద్వారా దేశ పురోభివృద్ధి, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తన పీఠం అధిష్టాన దేవత శ్రీ శారదాంబ అనుగ్రహంతో రాజాశ్యామల యాగం నిర్వహిస్తానన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు. పాలకులు సరిగా లేకపోతే వ్యవస్థ కుంటుపడుతుందని, తద్వారా సంఘంలో అనేక పరిణామాలు చోటుచేసుకుంటాయన్నారు. వీటిని అవగతం చేసుకున్న తాను ఓ పీఠాధిపతిగా సరిదిద్దడం కోసమే యాగం చేయనున్నామన్నారు.