రాష్ట్రీయం

వైకాపాలో చేరిన రవీంద్ర బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం టీడీపీ ఎంపీ రవీంద్ర బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్‌తో కలిసి ఆయన సోమవారం లోటస్ పాండ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. రవీంద్ర బాబుకు జగన్ పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా వారు కొంత సేపు ఏపీ రాజకీయాలపై కొంత సేపు చర్చించారు. సమావేశానంతరం రవీంద్ర బాబు మీడియాతో మాట్లాడుతూ వైకాపాలో చేరడం తనకు పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఏపీకి కలిగే లాభం ఏమీ లేదన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చారని, అందుకే ప్రత్యేక హోదా రాలేదని ఆయన విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికినందుకే హడావుడిగా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేశారని అన్నారు. ఒక్క సామాజికవర్గానికి మాత్రమే ప్రభుత్వం మేలు చేస్తున్నదని ఆయన విమర్శించారు. తనకు టీడీపీ ఎంపీగా తిరిగి పోటీ చేసేందుకు అవకాశం రాదన్న కారణంగానే వైకాపాలో చేరినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
నేడు కిల్లి కృపారాణి
ఇలాఉండగా కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మంగళవారం వైఎస్ జగన్‌ను కలిసి పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
చిత్రం..అమలాపురం ఎంపీ రవీంద్రబాబును పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైకాపా అధినేత వైఎస్ జగన్