రాష్ట్రీయం

నేడు ఐఐటి జెఇఇ మెయిన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: దేశవ్యాప్తంగా ఆదివారం నాడు ఐఐటి జెఇఇ మెయిన్స్ పరీక్ష జరగనుంది. గత రెండేళ్లుగా ఐఐటి జెఇఇ ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ పరీక్ష నిర్వహిస్తోంది. ఆఫ్‌లైన్ పరీక్ష ఏప్రిల్ 3న జరగనుంది. ఆన్‌లైన్ పరీక్ష ఏప్రిల్ 9, 10 తేదీల్లో జరగనుంది. రెండింటికీ కలిపి దాదాపు 13.3లక్షల మంది దరఖాస్తు చేశారు. ఆదివారం జరిగే ఆఫ్‌లైన్ పరీక్షకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి లక్షన్నర మంది హాజరుకానున్నారు. మెయిన్స్ పరీక్షలో 1.50 లక్షల మందిని క్వాలిఫై చేసి చివరికి ర్యాంకులను ప్రకటిస్తారు. వీరంతా అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హులవుతారు. పరీక్షకు ఆంధ్రాలో గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం రీజనల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ పట్టణాల్లో రీజనల్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.ఐఐటి మెయిన్స్ పరీక్ష తొలి కీని ఏప్రిల్ 18న విడుదల చేస్తారు. పరీక్ష స్కోర్లు ఏప్రిల్ 27న ప్రకటిస్తారు. అఖిల భారత స్కోర్లు జూన్ 30న ప్రకటిస్తారు.
అరగంట ముందే పరీక్ష హాల్‌లోకి
ఆదివారం నాడు పరీక్ష ఉదయం 9.30కు మొదలవుతుంది. అర్ధగంట ముందే అభ్యర్ధులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని ఐఐటి 3జాబ్2 ప్రకటించింది. అభ్యర్ధులు సంబంధిత పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. పేపర్-1 ఉదయం 9.30నుండి మధ్యాహ్నం 12.30 వరకూ జరుగుతుంది. పేపర్-2 ఆర్కిటెక్చర్ సబ్జెక్టు వారి కోసం మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతుంది.
కటాఫ్ 120 మార్కులు
కటాఫ్ మార్కులు 120 దాటవచ్చని విశే్లషకులు చెబుతున్నారు. 2013లో జనరల్ కేటగిరి అభ్యర్ధుల కటాఫ్ 113 మార్కులు, 2014లో కటాఫ్ 115 కాగా, ఈ ఏడాది కటాఫ్ 118 మార్కులు దాటుతుందని అంచనా వేస్తున్నారు.