రాష్ట్రీయం

శభాష్.. ఆకాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 2: తెలుగువారు విదేశీ విద్య కోసం అర్రులు చాస్తుంటే ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్ఠాకరమైన ప్రముఖ 16 విదేశీ విశ్వవిద్యాలయాలు.. పైగా భారీగా స్కాలర్‌షిప్‌లతో అడ్మిషన్ ఇస్తామంటూ ఓ విజయవాడ ముద్దుబిడ్డకు ఆఫర్‌లపై ఆఫర్‌లు ప్రకటించింది. విజయవాడకు చెందిన 17 ఏళ్ల మామిడి సాయి ఆకాష్ హైదరాబాద్‌లో ఫిట్జీ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసుకుని ఇంజనీరింగ్ కోర్సు యుఎస్‌లో చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. అతడి మేధాశక్తిని గుర్తించిన 16 విశ్వవిద్యాలయాలు స్కాలర్‌షిప్‌లు అందించి మరీ చేర్పించుకుంటామంటూ రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలికారు. వీటిల్లో స్టాన్‌ఫోర్డ్, కాలిఫోర్నియా, ఏల్, ప్రిన్సిటన్, కొలంబియా, బ్రేన్, డార్ట్‌వౌత్, డ్యూక్, మిషిగాన్, వాషింగ్టన్, జార్జియాటిక్, ఇల్లినాయిస్, రైస్ వంటి ప్రతిష్ఠాకర విశ్వవిద్యాలయాలున్నాయి. ఇలాంటి అవకాశం దేశంలో ఇంతకు ముందెవరికీ రాలేదు. అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఎసిటి పరీక్షలో 36 పాయింట్స్‌కు గాను 36 పాయింట్లతో ప్రపంచంలోనే మొదటి ర్యాంక్ సాధించడమే.. ఎంతో ప్రతిష్ఠాకరమైన పోటీ పరీక్ష ఎస్‌ఎటి-2లో ఫిజిక్స్, మ్యాథ్స్ విభాగాల్లో ఒక్కోదాంట్లోంచి 800 మార్కులకు గాను ప్రశ్నలుంటాయి. అలాంటి ఈ కఠినతరమైన పరీక్షలో సాయి ఆకాష్ నూటికి నూరు శాతం మార్కులు సాధించాడు. ఆసక్తికరమేమిటంటే ఇంటర్నెట్ వ్యవస్థాపకులు గూగుల్ సెర్చ్ ఇంజిన్ వ్యవస్థాపకులు చదివిన ప్రపంచ నెంబర్-1 స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఈ ఆకాష్‌ను కంప్యూటర్ సైన్స్‌లో చేర్చుకుంటామంటూ స్వాగతం పలికింది.
భవిష్యత్‌లో మంచి వ్యాపారవేత్తగా రాణించాలనే కోరికతో ఉన్న ఆకాష్ అండర్ గ్రాడ్యుయేషన్ కోసం కాలిఫోర్నియాలోనున్న స్టాన్‌ఫోర్డ్‌ను ఎంచుకున్నాడు. మూడు దశాబ్దాలుగా వేలాది మంది సిఎలను ఈ ప్రపంచానికి అందించిన సూపర్‌విజ్ అధినేత ఎంఎ గుప్తా, లక్ష్మిల ఏకైక తనయుడు ఆకాష్. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ ఈ పరిణామాలతో తనకు జీవిత సాఫల్య పురస్కారాలు వచ్చినంత ఆనందంగా ఉందన్నారు.