ఆంధ్రప్రదేశ్‌

కాల్‌మనీకి కాలదోషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 3: కాల్ మనీ.. గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్రాన్ని కుదిపేసిన అంశం. అవసరార్థం డబ్బు అప్పు తీసుకుంటే, అధిక వడ్డీలు బనాయించడం, బలవంతంగా ఆస్తులు రాయించుకోవడం, మహిళలను లైంగికంగా వేధించడం.. ఇవీ కాల్ మనీ వ్యాపారుల దురాగతాలు. విజయవాడలో వెలుగుచూసిన ఈ దారుణాలు రాష్టవ్య్రాప్తంగా సంచలనమయ్యాయి. కాల్ మనీ వ్యాపారులకు అధికార పార్టీ నాయకుల ఆశీస్సులు ఉన్నాయన్న నిజాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూడటంతో ప్రభుత్వం ఇరుకునపడింది. కాల్‌మనీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ అధికారులను ఆదేశించింది. నాలుగు నెలల కిందట వెలుగు చూసిన ఈ కాల్ మనీ కేసు ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? అని ప్రశ్నిస్తే.. కొండలా వచ్చిన ఈ కేసును మంచులా కరిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాధానం వస్తోంది.
విజయవాడ కేంద్రంగా జరిగిన, జరుగుతున్న కాల్ మనీ కేసులో బాధితులకు న్యాయం చేయాలని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నా, కింది స్థాయి పోలీస్ అధికారులు మాత్రం కాల్ మనీ వ్యాపారుల కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో ఏడుగురు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న ఒక నిందితుడు ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. మిగిలిన ఆరుగురిలో ఒక్కొక్కరూ నాటకీయ పరిణామాల నేపథ్యంలో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులను చేర్చిన పోలీసులు కనీసం వారి పేర్లు కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. వారిని ఎప్పుడు అరెస్ట్ చేశారో? ఎప్పుడు జైలుకు వెళ్లారో? ఎప్పుడు బెయిల్‌పై బయటకు వచ్చారో కూడా తెలియకుండా జరిగిపోయింది. ఇక్కడే ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులకు బెయిల్ రాకుండా ఉండేందుకు పోలీస్ ఉన్నతాధికారులు న్యాయ స్థానాల్లో చాలావరకూ ప్రయత్నించారు. చివరికి సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించడం గమనార్హం. విజయవాడలో సెక్స్ రాకెట్ వ్యవహారం బయటకు రావడంతో రాష్ట్రంలోని అన్ని పోలీస్ కార్యాలయాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కాల్ సెంటర్‌కు ఇప్పటి వరకూ 1200 మంది కాల్‌మనీ బాధితులు ఫిర్యాదులు చేశారు. కాల్‌మనీ వ్యవహారం బయటకు వచ్చిన రోజుల్లో నిత్యం 100 ఫిర్యాదులు అందేవి. ఇప్పుడు రోజుకు ఒకటో రెండో ఫిర్యాదులు మాత్రమే నమోదవుతున్నాయి. వీటిలో సుమారు 350 కేసులు కోర్టు, ప్రీ లిటిగేషన్ సెల్ పరిధిలోవి కాగా, అక్కడికక్కడే పరిష్కరించినవి మరో 350 వరకూ ఉన్నాయి. కాల్‌మనీ వ్యాపారుల బారినపడిన కేసులు విజయవాడ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో వంద వరకూ నమోదయ్యాయి.
ఆగని వ్యాపారం
ప్రభుత్వం కాల్‌మనీపై ఉక్కు పాదం మోపుతామని చెప్పినా, పోలీసుల నిఘా ఉన్నా, విజయవాడలో కాల్‌మనీ వ్యాపారం యథాతథంగా జరిగిపోతునే ఉంది. ఇదిలాఉండగా కాల్‌మనీ వ్యాపారాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించినా, ఇప్పటి వరకూ ఆ విషయం ఏమైందో తెలియడం లేదు. ఈ చట్టం అమల్లోకి తీసుకురావాలంటే కేంద్రం అనుమతి అవసరమవుతుందని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంతో మాట్లాడి చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావచ్చు. చట్టాన్ని అమలు చేస్తే, అధికార పార్టీకి చెందిన పెద్ద పెద్ద నాయకులే ఇరుక్కుంటారన్న ఉద్దేశంతో ఆ అంశాన్ని ప్రభుత్వం పక్కన పెడుతోందని ప్రతిపక్షం విమర్శిస్తోంది.

చిత్రం... కాల్‌మనీ దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న ఐద్వా కార్యకర్తలు (ఫైల్ ఫొటో)