రాష్ట్రీయం

ఉప రాష్టప్రతికి ఘనంగా వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, ఫిబ్రవరి 23: నెల్లూరు జిల్లాలో భారత ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడి నాలుగు రోజుల పర్యటన ముగిసింది. శనివారం ఉదయం 9.30 గంటలకు వెంకటాచలంలోని స్వర్ణ్భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు ప్రత్యేక వాహనంలో వెంకటాచలం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వెంకయ్యనాయుడు వెంట రైల్వేస్టేషన్‌కు వెళ్లిన రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇదిలావుండగా శనివారం నెల్లూరులో పర్యటన ముగించుకున్న ఉప రాష్టప్రతి ప్రత్యేక రైలులో రేణిగుంట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డుమార్గాన విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక వాయుసేన విమానంలో ఢిల్లీకి బయలుదేరివెళ్లారు.