ఆంధ్రప్రదేశ్‌

వచ్చే అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 3: వచ్చే అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోనే జరగనున్నాయని మున్సిపల్ మంత్రి నారాయణ తెలియచేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ సెక్రటేరియట్‌వద్ద అసెంబ్లీ కోసం నిర్మిస్తున్న ఆరో భవనంలో ఇంటీరియర్ ప్లాన్‌ను స్పీకర్, మండలి చైర్మన్ సహా ముఖ్యులంతా చూసి ఆమోదించారని చెప్పారు. ఈ భవన నిర్మాణాన్ని ఆగస్ట్ చివరినాటికి పూర్తి చేస్తామని ఆయన తెలియచేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు భవనాన్ని సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్ నుంచి ఆరువేలమంది ఉద్యోగులను అమరావతికి తరలించాలని అనుకున్నామని, కానీ సాంకేతిక కారణాల వలన 4,500 మంది ఉద్యోగులను మాత్రమే జూన్ 15 నాటికి తరలిస్తున్నామని నారాయణ వెల్లడించారు.

నల్లేరుపై ‘్ఫరాయింపు’ కాదు!

జ్యోతుల, వరుపులకు క్యాడర్ సెగ
కలసిరామని తెగేసి చెబుతున్న కార్యకర్తలు
అటు టిడిపిలోనూ అసమ్మతి జ్వాలలు

ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఏప్రిల్ 3: ఒక పార్టీ టిక్కెట్‌పై గెలుపొంది, నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అధికార పార్టీలో చేరుకున్న శాసనసభ్యులకు పరిస్థితి నల్లేరుపై నడక కాబోదని తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం సాగుతున్న రాజకీయం తేటతెల్లం చేస్తోంది. ఈ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌ను వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న జగ్గంపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావుకు ఆయా నియోజకవర్గాల పార్టీ శ్రేణుల నుండి పూర్తిస్థాయి మద్దతు లభించడంలేదు. తాము పార్టీ మారిన పక్షంలో కేడర్ మొత్తం తమ వెంటే నడుస్తుందని భావించిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు పరిస్థితి మింగుడుపడని విధంగా తయారవుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ రెండు గ్రూపులుగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కార్యకర్తలను సమీకరించే పనిలో ఎమ్మెల్యేలు పడ్డారు.
వీరిద్దరూ గత రెండేళ్లుగా విపక్ష ఎమ్మెల్యేలుగా అధికార పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వీరితో కలసి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన కార్యకర్తలు స్థానిక టిడిపి నేతలతో శత్రుత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ నేతలు రాత్రికి రాత్రే పార్టీని ఫిరాయిస్తే తమకు దిక్కెవరంటూ వైసిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ప్రత్తిపాడు శాసన సభ్యుడు సుబ్బారావు నియోజకవర్గంలోని శంఖవరంలో నిర్వహించిన సమావేశంలో కొందరు కార్యకర్తలు ఆయనకు ఎదురుతిరిగారు. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలతో పోరాడి, అనేక అంశాలలో విభేధించిన తమను కాదని, తమ అభిప్రాయాలతో సంబం ధం లేకుండా పార్టీ ఫిరాయిస్తే మీ వెనుక వచ్చేందుకు తాము సిద్ధంగా లేమంటూ పలువురు కార్యకర్తలు తెగేసిచెప్పారు. దీంతో వరుపుల ఫిరాయింపు అంశాన్ని సమర్ధించిన కార్యకర్తలు అనుకూల గ్రూపుగాను, వ్యతిరేకించిన కార్యకర్తలు ప్రతికూల గ్రూపుగాను తయారయ్యారు. మరోవైపు తెలుగుదేశంలోనూ వరుపుల రాకను వ్యతిరేకించే వర్గం తయారయ్యింది. నిన్న మొన్నటి వరకు ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే పర్వత శ్రీ సత్యనారాయణమూర్తి మృతితో ఆయన సోదరుడు పర్వత రాజబాబుకు ప్రత్తిపాడు ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించాలని అక్కడి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సుబ్బారావును పార్టీలో చేర్చుకుని, ఆయనకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించిన పక్షంలో పార్టీ జెండాను ఇంతకాలంగా మోసిన తాము వెనక్కి వెళ్ళక తప్పదన్న సంకేతాలను కూడా పర్వత వర్గీయులు అధినేతకు పంపినట్టు తెలుస్తోంది.
జగ్గంపేట విషయానికి వస్తే జ్యోతుల నెహ్రూకు వైఎస్సార్ కాంగ్రెస్ కేడర్ మద్దతు బాగానే ఉన్నప్పటికీ కొందరు ముఖ్యనేతలు మాత్రం ఆయన వెంట నడవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం నుండి జగన్ వెంటన నడిచిన కొందరు నేతలు, కార్యకర్తలు ఇప్పటికే ఒక గ్రూపుగా తయారయ్యారు. జ్యోతుల పార్టీ ఫిరాయించిన మరుక్షణం ఓ నేతను ఈ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ప్రకటించేందుకు అధినేత జగన్ నిర్ణయించినట్టు తెలిసింది. అయితే జ్యోతులకు కూడా తెలుగుదేశం నుండి వ్యతిరేక, అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జిగా ప్రస్తుతం జ్యోతుల చంటిబాబు వ్యవహరిస్తున్నారు. జ్యోతు ల నెహ్రూ దేశం తీర్థం పుచ్చుకున్న పక్షంలో చంటిబాబు పాత్ర నామమాత్రం అవుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో గ్రూపులు తథ్యమన్న ప్రచారం జరుగుతోంది.