ఆంధ్రప్రదేశ్‌

కాలినడకన ఖండాంతర యానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 3: భారత్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు విశాఖకు చెందిన ఆదినారాయణ. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎం.ఆదినారాయణ ఆరు ఖండాల్లోని 14 దేశాల్లో 35 వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం సాగించారు.
ఆదివారం ఎయులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తన అనుభవాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ప్రపంచం అంతా చుట్టిరావాలని మనసులో ఉండేదని, నేడు ఆ కోరిక నెరవేరిందన్నారు. 2010 మే నెలలో నేపాల్ నుంచి ప్రారంభించిన పాదయాత్ర ఈనెల మార్చిలో బ్రెజిల్‌తో ముగిసిందన్నారు. ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో పర్యటించానన్నారు. నేపాల్, భూటాన్, చైనా, ఇరాన్, మెక్సికో, స్వీడన్, నైజీరియా, రియో డిజనరియో, ఫ్రాన్స్, ఇటలీ, లండన్, స్కాట్‌లాండ్, నార్వే, హోబర్ట్, బ్రెజిల్ దేశాలను చుట్టేశానన్నారు. ఆయా దేశాల్లో పర్యటించినపుడు అనేక అడ్డంకులు ఎదురైనప్పటికీ స్నేహితులు, బంధువుల సహకారంతో యాత్రను విజయవంతంగా పూర్తిచేయగలిగానన్నారు. ఈ సందర్భంగా అక్కడ పరిస్ధితులపై రాసిన పుస్తకాలు, ఫొటోలను ప్రదర్శించారు. ఆయన రాసిన భ్రమణ కాంక్ష, జిప్సీలు, డెకొరేటివ్ ఆర్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ టెంపుల్స్, స్ర్తి యాత్రికులు, మహా యాత్రికులు, తెలుగువారి ప్రయాణాలు అనే పుస్తకాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ ఏడాది అక్టోబర్‌లో రెండవ దఫా యాత్రకు బయలుదేరుతున్నానన్నారు.