ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో మెడ్‌టెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 3: దేశంలోనే ఎక్కడాలేని విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 225 కోట్ల రూపాయల పెట్టుబడితో మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు వచ్చిన సందర్భంగా బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 260 ఎకరాల్లో మెడ్‌టెక్ పార్క్‌కు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా ప్రధాన ఆసుపత్రుల్లో క్యాన్సర్ నివారణ చికిత్స సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు ప్రభుత్వాసుపత్రుల్లో సేవలను అందుబాటులోకి తీసుకు రానున్నామని అన్నారు. ఇందులో భాగంగానే గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రూ.16 కోట్ల రూపాయలతో క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించేందుకు దాత ముందుకు వచ్చారని, డిసెంబర్ నాటికి పూర్తిచేసి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్టవ్య్రాప్తంగా ఇప్పటికే 1400 మంది వైద్యులను నియమించామని, మరో 500 మందిని తీసుకోవాల్సిన అవసరముందన్నారు. 2015-16 సంవత్సరానికి తల్లి, పిల్లల మరణాల నమోదు సంఖ్యను తగ్గించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రం ముందంజలో ఉందని, ఇందుకు కేంద్రప్రభుత్వం నుంచి అవార్డుతో పాటు ప్రోత్సాహకాన్ని కూడా అందుకున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆర్థికంగా ఎంతగానో ఆదుకుంటోందని, అందించిన సేవలను మరిచిపోయి నేతలు మాట్లాడటం సమంజసం కాదన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత బిజెపి ప్రభుత్వంపై ఉందని, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తామని డాక్టర్ కామినేని పేర్కొన్నారు.

నకిలీ ఎంఫిల్, పిహెచ్‌డిలపై
సిఐడి విచారణ

ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఏప్రిల్ 3: ద్రవిడ యూనివర్సిటీలో సీమ జిల్లాలకు చెందిన వందలాది మంది పరీక్షలు రాయకుండానే ఎంఫిల్, పిహెచ్‌డి సర్ట్ఫికెట్లు పొందిన వ్యవహారంపై సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలో దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. నకిలీ ఎంఫిల్, పిహెచ్‌డి సర్ట్ఫికెట్ల ద్వారా సీమ జిల్లాల్లో వందలాది మంది పదోన్నతులు పొంది కొంతమంది రాష్టస్థ్రాయి అధికారులుగా కూడా కొనసాగుతున్నారు. పలు ప్రైవేట్ స్టడీ సర్కిల్స్, ప్రైవేట్ డిగ్రీ, పిజి కళాశాలల యాజమాన్యాలు పెద్దఎత్తున విద్యార్థుల నుంచి వసూళ్లుచేసి తమకున్న పలుకుబడి ద్వారా ద్రవిడ విశ్వవిద్యాలయం నుంచి సర్ట్ఫికెట్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ద్రవిడ విశ్వవిద్యాలయంలో అక్రమాల వ్యవహారంపై గత ఏడు సంవత్సరాలుగా తూతూ మంత్రంగా విచారణ జరుగుతోంది. తాజాగా యూనివర్సిటీ చాన్స్‌లర్ అయిన గవర్నర్ రంగంలో దిగి కొరడా ఝళిపించారు. యూనివర్సిటీ అక్రమాలపై అనేక కమిటీలను నియమించినా ఏ కమిటీ కూడా ఇంతవరకు నకిలీలను గుర్తించలేదు. కొంతమంది విశ్వవిద్యాలయం అధికారులు 2007-08 నుంచి నాలుగేళ్లపాటు పెద్దఎత్తున విద్యార్థులను చేర్చుకోవడంతో చాలామంది నకిలీలు ప్రవేశించారు. 2010లో యుజిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి, 2007 నుంచి జారీ అయిన అందరి సర్ట్ఫికెట్ల దర్యాప్తునకు ఆదేశించింది. యుజిసి ఆదేశాలను సవాల్‌చేస్తూ పలువురు విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. గత ఐదారేళ్లుగా ఈ వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో తాజాగా ప్రభుత్వం తరపున ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సుమితా దావ్రా చొరవతీసుకుని సిబిసిఐడి విచారణకు ఆదేశించారు. 2007 నుంచి 2010 వరకు విశ్వవిద్యాలయం నుంచి జారీ అయిన ఎంఫిల్, పిహెచ్‌డి నకిలీ సర్ట్ఫికెట్లు పొందిన వారందరిపై వేటు వేసేందుకు రంగం సిద్దమైంది. కాగా, ప్రస్తుతం ద్రవిడ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ ఎంఫిల్, పిహెచ్‌డి విద్యార్థులకు నకిలీ సర్ట్ఫికెట్ల వ్యవహారం శాపంగా పరిణమించింది.