రాష్ట్రీయం

ఆక్రమణలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 4: రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వే జరిపించారు. ఆయా మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న పనులు, ఆక్రమణలతో పాటు వీధికుక్కల లెక్కల వివరాలను ఆయన సేకరించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సిన 11 నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల కమిషనర్లు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఇక్కడ భేటీ అయ్యారు. సాయంత్రం సుమారు 5 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 10.30 గంటల వరకూ సాగింది.
మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో రోడ్లు, డ్రైన్లు అస్తవ్యస్తంగా ఉన్నట్టు ఆయన నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. విశాఖ నగరంలో ఇటీవల జరిగిన సిఐఐ సదస్సు, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా రోడ్లు, డ్రైన్లను మెరుగుపరిచారు. అలాగే సుందరీకరణ పనులు పెద్దఎత్తున నిర్వహించారు. దీనిపై కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌ను ఆయన అభినందించారు. అయితే నగర శివార్లు, విలీన ప్రాంతాల్లో మాత్రం అభివృద్ధి పనులు జరగడం లేదని, పారిశుద్ధ్య పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, మరీ ముఖ్యంగా కుక్కల బెడద ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తపర్చారు. అలాగే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో మంచినీటి సౌకర్యాన్ని మరింత పెంచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. వీలైనంత వరకూ ట్యాంకుల ద్వారా నీటిని అందించాలని ఆయన ఆదేశించారు. డ్రైన్లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలన్నారు. నగరాల్లో రౌడీయిజం పెరిగిపోతోందని, పోలీస్ అధికారులను సమన్వయపరచుకుంటూ అదుపు చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. భూ ఆక్రమణలను, ప్రభుత్వ భూముల కబ్జాలను అరికట్టాలని ఆదేశించారు.
ఎన్నికల నేపథ్యంలో..
రాష్ట్రంలో విశాఖ నగరపాలక సంస్థతో పాటు 11 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా మున్సిపాలిటీల్లో ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ఆదేశించారు. ఈ మున్సిపాలిటీల్లో పెండింగ్ పనులు పూర్తిచేయాలని, అవసరమైనచోట వార్డుల విభజన కార్యక్రమాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.