రాష్ట్రీయం

ఉచిత, నిర్బంధ విద్య అమలు బాధ్యత మీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అమలు చేసేందుకు ఉద్దేశించిన 2009 చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలదేనని హైకోర్టు స్పష్టం చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బోసేల్, జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన డివిజన్‌బెంచ్ సోమవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. నాన్ మైనార్టీ అన్‌ఎయిడెడ్ స్కూల్స్‌లో 2009 ఉచిత, నిర్భంధ విద్య చట్టం అమలయ్యే విధంగా ఆదేశించాలని, 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు ఆయా స్కూళ్లలో అమలు చేయాలని పలు పిటీషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటీషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు విద్య అనేది పిల్లలకు ఉన్న హక్కు, ఈ హక్కును కాదని ప్రభుత్వాలు తప్పించుకోలేవని వ్యాఖ్యానించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున హైకోర్టుకు హాజరైన అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు వివరణ ఇస్తూ ఈ కేసును మూడు వారాలకు వాయిదా వేయాలని కోరారు. ఈలోగా ప్రభుత్వం ఉచిత, నిర్భంధ విద్యపై సర్క్యులర్‌ను తయారు చేసి అన్ని ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ విద్యా సంస్థలకు జారీ చేస్తుందని వెల్లడించారు. అలాగే 25 శాతం సీట్లను ఉచితంగా అందించేందుకు కూడా ప్రభుత్వం ఆదేశిస్తుందని తెలిపారు. ఈ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాలకు ఇప్పటికే చాలా అవకాశాలు ఇవ్వడం జరిగిందని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రెండు వారాల్లోగా ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు సర్క్యులర్‌లను జారీ చేయాలని, ఆ సర్క్యులర్ కాపీలను కోర్టు ముందు ఉంచాలని బెంచ్ ఆదేశించింది. అనంతరం ఈ కేసును రెండు వారాలు వాయిదా వేసింది.