ఆంధ్రప్రదేశ్‌

అచలానందస్వామి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మంగారిమఠం, ఏప్రిల్ 5: మహా యోగి అచలానంద స్వామి సోమవారం రాత్రి ఒంగోలులోని తన ఆశ్రమంలో పరమపదించారు. రాత్రికి రాత్రే ఆయన పార్థివ దేహాన్ని కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం తోట్లపల్లెలోని ఆయన ఆశ్రమానికి తరలించారు. ప్రకాశంజిల్లా నాగులుప్పలపాడు మండలం వమ్మేవరం గ్రామానికి చెందిన నెల్లూరు పుల్లయ్యశర్మ, వెంకటసుబ్బమ్మ దంపతులకు అచలానంద స్వామి జన్మించారు. చిన్న వయస్సులోనే తల్లి చనిపోవడంతో తండ్రే పెంచి పెద్దచేశాడు. తండ్రి పుల్లయ్యశర్మ ఉపాధ్యాయుడుగా పనిచేసే వారు. అచలానందస్వామికి ఆరున్నరేళ్ల క్రితం త్రికాలజ్ఞాని పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వాములవారు దర్శనమివ్వడంతో అజేయమైన ఆధ్యాత్మిక తేజస్సును పొందగలిగారు. స్వామివారు ఆధ్యాత్మికంతోపాటు జ్ఞాన దానం, విద్యా, వైద్య, అన్నదానాలు ధ్యేయంగా కృషిచేశారు.
అచలానందస్వామి గత మూడురోజులుగా ఎటువంటి ఆహారం తీసుకోకుండా భక్తులు, శిష్యులతో మాట్లాడకుండా ధ్యానంలోకి వెళ్లారు. తాను పరమపదం పొందిన తర్వాత తన పార్థివ దేహాన్ని తోట్లపల్లెలోని ఆశ్రమానికి ఎదురుగా ప్రస్తుతం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రాంతంలో సమాధి చేయాలని ముందుగానే శిష్యులకు చెప్పారు. ఆయన అభీష్టం మేరకే ఒంగోలులోని ఆశ్రమం నుంచి పార్థివ దేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చారు. స్వామివారిని చివరిసారిగా చూసేందుకు మండల ప్రజలతోపాటు ఇతర ప్రాంత్రాలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అచలానంద స్వామి పార్థివ దేహాన్ని బుధవారం ఉదయం సమాధి చేయనున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు విరజానందస్వామి తెలిపారు.

ఆశ్రమంలో అచలానందస్వామి పార్థివదేహం