ఆంధ్రప్రదేశ్‌

స్థానిక సంస్థల అధికారాలు హరించే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 5: కేంద్ర పర్యావరణ పరిరక్షణ శాఖ నుంచి సరైన అనుమతులు లేకుండానే రాజధాని నిర్మాణపు పనులను వేగవంతం చేస్తూ అత్యున్నత న్యాయస్థానాలను సైతం పక్కదారి పట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్‌డిఎ పరిధిని, స్థానిక సంస్థల అధికారాలను హరింప చేసేందుకు ఎంతో రహస్యంగా పన్నాగాలు పన్నుతున్నారని పర్యావరణ పరిరక్షణ ఉద్యమవేత్త పండలనేని శ్రీమన్నారాయణ ఆరో పించారు. రాజధాని నిర్మాణపు పనులను సవాల్ చేస్తూ జాతీయ హరిత ధర్మాసనంలో దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ ఈ నెల 22 తేదీకి వాయిదా పడిందన్నారు. మంగళవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఆర్‌డిఎ పరిధిలో దాదాపు 8 వేల చ.కిమీ విస్తరించిన రాజధాని ప్రాంతంలో ‘కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ మెయింటెనెన్స్ అథారిటీ (సిసిడిఎంఎ)’ను ఏర్పాటుచేస్తూ దానికి విశేష అధికారాలు కల్పిస్తూ ఇటీవల 109, 110 జీవోలను జారీ చేశారన్నారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారిని నియమించి ఏ కారణం చేతనో వెంటనే ఆ ఉత్తర్వును రద్దు చేశారన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన నగర, పురపాలక సంస్థలు, గ్రామ పంచాయతీల అధికారాలన్నింటినీ ఆ సంస్థకు అప్పగించిందన్నారు. ఆస్తి పన్ను, డ్రైనేజి పన్ను, చెత్త పన్ను, వినోద పన్ను వంటి రకరకాల పన్నులను ఏమేర విధించాలనే నిర్ణయాలను తీసుకునే అధికారాన్ని అప్పగించడం వల్ల స్థానిక సంస్థల పాలక వర్గాలు నిర్వీర్యం కాగలవన్నారు. రైతుల నుంచి సమీకరించిన భూములను విదేశీ కంపెనీలకు 99 ఏళ్ల లీజుకు కట్టబెట్టే అధికారాన్ని కూడా ‘సిసిడిఎంఎ’కు కట్టబెట్టబోతున్నారన్నారు. జీవోలన్నింటిని విల్లమ్ముల పొదలోదాచి అవసరమైనప్పుడు ఒక్కోదాన్ని వెలుపలకు తీస్తున్నారన్నారు.