రాష్ట్రీయం

చైనాను కట్టడి చేయలేరా?: అసద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చైనా దూకుడుకు బదులిచ్చారా? అని మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. జైషే మహ్మద్ ఉగ్రనేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ఘోరంగా విఫలమయ్యారని ఆయన గురువారం ట్విట్టర్‌లో విమర్శించారు. మన దేశ సాయుధ దళాలు ఉపయోగించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో చైనా మెటీరియల్ ఉంటుందని, మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీపైనా చైనా ముద్ర ఉందన్నారు. ఇప్పుడు మసూద్ అజర్ విషయంలోనూ చైనాదే పైచేయిగా ఉందని ఆయన విమర్శించారు. జమ్మూ-కాశ్మీర్‌లోని అనంతనాగ్ లోక్‌సభ స్థానానికి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. ఒక లోక్‌సభ స్థానాన్ని మూడు భాగాలుగా చేసి ఎన్నికలు నిర్వహించడం ఎప్పుడైనా జరిగిందా? అని ఆయన ప్రశ్నించారు. అనంతనాగ్ నియోజకవర్గంలో నాలుగు జిల్లాలో ఉంటే ఒక దఫా రెండు జిల్లాల్లో, మిగతా రెండు జిల్లా ల్లో రెండు వేర్వేరు తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.