రాష్ట్రీయం

వైద్యరంగంలో మరిన్ని సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: భారతదేశంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వైద్య రంగంపై ప్రపంచంలోని ఇతర దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్న ఘనత మన దేశానిదేనని అన్నారు. కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో గురువారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ వైద్య రంగంలో మరిన్ని సంస్కరణలు వస్తే ప్రపంచ చిత్ర పటంలో భారతదేశం ఎంతో ముందుందన్నారు. అమెరికాలో వైద్యానికి పదివేల రూపాయలు ఖర్చు అయితే మన దేశంలో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే అవుతుందని ఆయన తెలిపారు. ప్రపంచ స్థితిగతులను మార్చగలిగే మానవ వనరులు మన దేశంలో అపారంగా ఉన్నాయని, దీనిని ఉపయోగించుకుంటే అద్భుతాలు సాధించవచ్చని అన్నారు. నేటికీ భారతదేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తారతమ్యం ఏ మాత్రం తగ్గలేదన్నారు. ఒకవైపు అభివృద్ది చెందిన భారతదేశంగా, మరోవైపు వెనుకబడిన భారతదేశంగా ఉంటోందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య తారతమ్యం తొలగకుంటే సమగ్ర భారతం సాకారం కాదని ఆయన స్పష్టం చేశారు. వసతులన్నీ ఎక్కువ శాతం పట్టణ ప్రాంతాలకే పరిమితం కావడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలకు వలస వెళుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి చేపడితే గ్రామాలు కళకళలాడతాయన్నారు. పూర్వీకులు ఎటువంటి చదువు సంధ్యలు లేకపోయినా భారీ స్థాయిలో వ్యవసాయం చేసి నాణ్యమైన ఉత్పత్తులు సాధించారని, ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వివరించారు. నాడు వృత్తులు, ప్రవృత్తులు ఆధారంగా కులాలు ఏర్పడ్డాయని, నేడు కుల సంస్కృతి పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఉపాధ్యాయుడు తన కుమారుడ్ని ఉపాధ్యాయుడ్ని చేయడం లేదని, రైతు కూడా వ్యవసాయం చేయనీయడం లేదని ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాలకు పూర్వ వైభవం తీసుకొచ్చినప్పుడే సమగ్ర భారతదేశం సాధ్యమవుతుందని అన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఉత్సాహం, ఉల్లాసం చూస్తుంటే తన విద్యాభ్యాసం నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. సమాజంలో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుని విద్యావ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆకట్టుకున్న యోగా
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల యోగా ప్రదర్శనలను తిలకించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంతో ఆనందపడ్డారు.
భారతీయ సంస్కృతి సాంప్రదాయ కళలైన 64 కళల్లో యోగా ఒకటని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జేయుకేటీ ఉపకులపతి పి రామచంద్రరాజు, డైరెక్టరు డి సూర్యచంద్రరావుతో పాటు పలువురు ట్రిపుల్ ఐటీ అధికారులు పాల్గొన్నారు.

చిత్రాలు.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు