ఆంధ్రప్రదేశ్‌

‘మురమళ్ళ’కు పర్యాటక శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 5: తూర్పు గోదావరి జిల్లాలోని ఐ పోలవరం మండలం మురమళ్ళ తీర ప్రాంతానికి పర్యాటక ప్రాముఖ్యతను కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాజెక్టులు చేపట్టనున్నాయి. ఈ కారణంగానే ఈ ఏడాది నుండి మురమళ్ళ కేంద్రంగా రాష్టస్థ్రాయిలో కోనసీమ ఉత్సవ్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కోనసీమ ప్రధాన కేంద్రం అమలాపురం అయినప్పటికీ కోనసీమలో మురమళ్ళ ప్రాంతానికి ఉన్న పర్యాటక ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని, ఇక్కడే రాష్టస్థ్రాయి ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీర ప్రాంతంలో గల మురమళ్ళ సహజ సిద్ధమైన ప్రకృతి వాతావరణం, ఆహ్లాదకరమైన కొబ్బరి తోటలు, మడ అడవులు, గోదావరి లంకలు, వాగులు, వంకలతో కళకళలాడుతూ ఉంటుంది. ఆధ్యాత్మికంగానూ ఈ ప్రాంతం అనేక ఆకర్షణలు కలిగివుంది. మురమళ్ళతో పాటు ఎస్ యానాం, బోడసకుర్రు, అంతర్వేది, ఓడలరేవు ప్రాంతాలు దేనికవే ప్రత్యేకతలు కలిగివున్నాయి. మురమళ్ళ, ఎస్ యానాం మీదుగా ఓడలరేవు వరకు ప్రత్యేక పర్యాటక ప్రాజెక్ట్‌లను అమలుచేయనున్నట్టు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
వీటన్నిటినీ టూరిజం స్పాట్స్‌గా అభివృద్ధి చేస్తూ పర్యాటకులను కోనసీమ పెద్ద ఎత్తున ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దనున్నారు. కాకినాడ హోప్ ఐలాండ్ నుండి కోనసీమ వరకు ప్రత్యేక పర్యాటక ప్రాజెక్ట్ అమలుకు రూ.150 కోట్లు ఇటీవల విడుదల కాగా, గోదావరి తీరం వెంబడి పర్యాటక ప్రాజెక్ట్‌ల కోసం మరో రూ.100 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధులతో కోనసీమలో పర్యాటక ప్రాంతాలు పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే కోనసీమ ఉత్సవ్ ముగిసిన అనంతరం మురమళ్ళ నుండి అంతర్వేది వరకు టూరిజం స్పాట్స్ అభివృద్ధికి సంబంధించి సిద్ధంచేసిన ప్రణాళికలను అమలుచేయనున్నారు. కోనసీమలోని ఐ పోలవరం మండలం మురమళ్ళలో బుధవారం నుండి ఈనెల 10వ తేదీ వరకు జరిగే కోనసీమ ఉత్సవ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోనసీమ ఉత్సవ్‌ను రాష్టస్థ్రాయి ఉత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది.