రాష్ట్రీయం

ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోబోమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తేల్చిచెప్పారు. ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండానే చంద్రబాబును ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియాతో కేటీఆర్ ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. రాజకీయ ఎత్తుగడలలో భాగంగా ఎంపీ అభ్యర్థుల ఎంపికలో తమ అధినేత కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. ‘టీఆర్‌ఎస్ పార్టీకి ఎన్నికలు ఏవైనా అభ్యర్థులు ఎవరన్నది ముఖ్యం కాదు. అన్ని నియోజకవర్గాల ప్రజలు కేసీఆర్‌నే అభ్యర్థిగా భావించి ఓట్లు వేస్తారు’అని ఆయన ప్రకటించారు. కొన్ని జాతీయ పార్టీల కంటే ఎక్కువ ఓట్లు, సీట్లు టీఆర్‌ఎస్‌కు ఉన్నాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కొన్ని జాతీయ పార్టీల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో అవసరమైతే జాతీయ పార్టీ పెడుతామని మాత్రమే కరీంనగర్ సభలో అధినేత చంద్రశేఖరరావు అన్నారని గుర్తు చేశారు. దాని అర్థం ఇప్పటికిప్పుడని కాదన్నారు. కాంగ్రెస్, బీజేపీ అంటే గిట్టని పార్టీలు దేశంలో బోలెడన్ని ఉన్నాయయని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రేసేతర ఉన్న పార్టీలను జాతీయస్థాయిలో కూడగడుతామని ఆయన వెల్లడించారు. దేశ ప్రజలకు ఏమి అవసరమో అదే అజెండాగా ముందుకు వెళ్తామన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన మేధావులతో తమ అధినేత కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారన్నారు. ‘్ఢల్లీ రాజకీయాలపై ఎలా స్పందించాలో కేసీఆర్‌కు తెలుసు’అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మినహా మిగతా అన్ని చోట్ల ఉండవచ్చన్నారు. తాను ఎక్కువగా మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల స్థానాలపై ఫోకస్ పెట్టానని కేటీఆర్ చెప్పారు. చంద్రబాబు తాను చేసిందేమిటో చెప్పుకోకుండా తమపై పడి ఆరోపణలు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. జగన్ పార్టీకి స్విచ్ ఎక్కడుందని అని ప్రశ్నిస్తున్న చంద్రబాబు సైకిల్‌కు గాలి ఎవరు కొడుతున్నారో చెబితే బాగుండేదని ఎద్దేవా చేశారు. తాము ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏమిటో ఏప్రిల్ 11 తర్వాత తెలుస్తుందని ఆయన వ్యంగ్యోగ్తులు చేశారు. సీఆర్ తన కింద పని చేశారంటూ చంద్రబాబు అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసినంత మాత్రాన ఆయన కింద పని చేసినట్టా? అని ప్రశ్నించారు. కింద పని చేయడానికి మంత్రులేమైనా బానిసలా? టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరి కింద పని చేయరని, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో మంత్రిగా పని చేసినప్పుడు ఎవరి కింద పని చేశారని కేటీఆర్ అన్నారు.