ఆంధ్రప్రదేశ్‌

సాగర్‌ను సందర్శించిన జపాన్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఏప్రిల్ 5: నాగార్జునసాగర్ ప్రాజెక్టును మంగళవారం మాజీ చీఫ్ ఇంజనీర్ బషీర్ ఆధ్వర్యంలో జపాన్ దేశానికి చెందిన ఇంజనీర్ల బృందం సందర్శించి పరిశీలించింది. దీనిలో భాగంగా నాగార్జునసాగర్ డ్యాం అంతర్భాగంలో ఉన్న గ్యాలరీలను వారు పరిశీలించారు. అనంతరం నాగార్జునకొండ మ్యూజియం, ప్రధాన జల విద్యుత్ కేంద్రాన్ని వారు సందర్శించారు. బుధవారం ఈ బృందం కుడికాలువను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా మాజీ సిఇ బషీర్ మాట్లాడుతూ జపాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైనర్ ఇరిగేషన్ కింద చెరువులు, కుంటలు అభివృద్ధిపరచడానికి 2 వేల కోట్ల రూపాయలు రుణం ఏర్పాటు చేసిందని, దీనిలో భాగంగా 16 మంది ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలలో ఉన్న చెరువులు, కుంటలను పరిశీలించిందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కూడా భాగమైనందున మంగళవారం జపాన్ ఇంజనీర్ల బృందంలోని శిబుత, హలైవా, మెతియా, ఓనియో, పూకో నిపుణులు సాగర్‌ను సందర్శించారు తెలిపారు. నాగార్జునసాగర్ జలాశయానికి రెండురోజులుగా వస్తున్న ఇన్‌ఫ్లో తాత్కాలికంగా నిలిచిపోయింది. సాగర్ జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను కనీస నీటిమట్టం 510 అడుగుల కంటే తక్కువగా 507.40 అడుగులకు తగ్గిపోయింది. శ్రీశైలం నుండి ఎటువంటి నీరు మంగళవారం సాయంత్రం వరకు కూడా చేరుకోలేదు. ప్రస్తుతం ఎడమకాల్వ ద్వారా 5,020 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దీంతోపాటు ఎస్‌ఎల్‌బిసి ద్వారా 800 క్యూసెక్కులను మొత్తంగా 5820 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే కుడికాలువకు విడుదల చేస్తున్న నీటిని డ్యాం అధికారులు నిలిపివేశారు. సాగర్ జలాశయం నుండి ఎడమకాల్వ ద్వారా తాగునీటి అవసరాల నిమిత్తం నీటి విడుదల చేస్తున్నప్పటికీ సరైన స్థాయిలో మంచినీటి చెరువులను, కుంటలను నింపకుండానే ఎడమకాల్వ జలాలను ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారని, ఇప్పటికే నల్లగొండ జిల్లా పరిధిలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారని, ఎడమకాల్వ ద్వారా విడుదలయ్యే నీటితో జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలను పూర్తిస్థాయిలో నింపిన తరువాతే ఖమ్మం జిల్లాకు నీటిని పంపించాలని డిమాండ్ చేశారు.