ఆంధ్రప్రదేశ్‌

తప్పు చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: ‘ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజా అసెంబ్లీ ప్రివిల్లేజస్ (సభా హక్కుల ఉల్లంఘన) కమిటీ ముందు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 18న అసెంబ్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో ఆమెను సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇలాఉండగా ప్రివిలేజస్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో కమిటీ సమావేశమైంది. కమిటీ ముందు హాజరయ్యేందుకు మరోసారి గడువు ఇవ్వాలని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సభ అభిప్రాయపడింది. ఈ మేరకు కమిటీ సమావేశానికి రోజా హాజరయ్యారు. అయితే సమావేశం అంతా సాఫీగా జరగలేదు. కమిటీ సభ్యులు ఆమెను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నించగా, ఆమె కూడా గట్టిగా తన వాదన వినిపించారు. ప్రివిలేజెస్ కమిటీ ముందుకు తాము గతంలో ఎన్నో పిటీషన్లు దాఖలు చేసినా ఏనాడూ కమిటీ సమావేశానికి సంబంధిత పిటీషన్లకు చెందిన వారిని పిలవలేదని, ఇప్పుడు ఎమ్మెల్యే అనిత దాఖలు చేసిన పిటీషన్‌పైనే ఎందుకు పట్టుబట్టారని ఆమె ప్రశ్నించారు. కమిటీ సభ్యులు అందుకు స్పందిస్తూ ‘అదంతా కాదు, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏమైనా చెప్పదలచుకున్నారా?’ అని ప్రశ్నించారు. తాను తప్పు చేయలేదని, తననే పాలకపక్ష సభ్యులు దుర్భాషలాడారని ఆమె వాదించారు. ఎవరో దురుద్దేశ్యంతో అనితతో పిటీషన్ వేయించారని, అనితకు తనకు మధ్య ఎటువంటి వైషమ్యాలు లేవని అన్నారు. మళ్లీ కమిటీ సభ్యులు ఇప్పుడు ఏమి చెప్పదలచుకున్నారని ప్రశ్నించగా, అసలు నన్ను మాట్లాడనీయరేమిటీ? అని రోజా ప్రశ్నించారు. ఇక్కడ మీరు మాట్లాడనీయరు, సభలో స్పీకర్ మాట్లాడనీయరు అని ఆమె అన్నారు. ఆ రోజే సభలో ఒక్క నిమిషం తనకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి ఉంటే, ఇంత దూరం వచ్చి ఉండేది కాదని, వాస్తవంగా ఏమి జరిగిందో వివరించేందుకు అవకాశం ఉండేదని ఆమె తెలిపారు. సభ విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయమని, ఇక్కడ మీ వాదన వినిపించుకోవడానికే పిలిచామని చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అన్నారు. రోజా తిరిగి మాట్లాడుతూ సభలో అవమానించారని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పుడు అకారణంగా ఇద్దరు మహిళల మధ్య తగువు పెట్టారని ఆమె తెలిపారు. ఇలా గంటన్నరకు పైగా చర్చ జరిగింది.
తాను తప్పు చేయలేదంటూనే రోజా వాదించారు. కాగా ప్రివిల్లేజస్ కమిటీ సభ్యుడైన వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచన మేరకు ఆమె మాట్లాడుతూ ‘నా వ్యాఖ్యలతో ఎమ్మెల్యే అనిత తన హృదయానికి గాయమైనట్లు భావిస్తే, నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా..’ అని చెప్పారు. సమావేశానంతరం కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ ఈ వివాదాన్ని స్పీకర్ తమ పరిశీలనకు అప్పగించడంతో, రోజాను పిలిపించి ఆమె వాదన విన్నామని అన్నారు. దీనిపై కమిటీ మరోసారి సమావేశమై, నివేదిక తయారు చేసి స్పీకర్‌కు అందజేయనున్నట్లు చెప్పారు. కమిటీ సమర్పించే నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ సభ ముందు పెడతారు. సభ పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.
ఇలాఉండగా రోజా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. రోజా మొండికేస్తేనే ఏడాది వరకూ సస్పెన్షన్ కొనసాగించవచ్చని భావించింది. అయితే రోజా తన వ్యాఖ్యలను ఉపసంరించుకోవడంతో ప్రభుత్వం ఇంకా పట్టుదలతో ఆమె సస్పెన్షన్‌ను కొనసాగించలేదు. కాగా సుప్రీంకోర్టులో రోజా అప్పీలుపై గురువారం విచారణ జరగనున్నది. సుప్రీంకోర్టు తీర్పు రోజాకు అనుకూలంగా వస్తే ప్రభుత్వం ప్రివిల్లేజస్ కమిటీ సంతృప్తి చెందలేదన్న వంకతో ఏడాది పాటు సస్పెన్షన్‌ను కొనసాగిస్తుందా? లేక సుప్రీం తీర్పును గౌరవిస్తూ, ప్రివిల్లేజస్ కమిటీ కూడా సానుకూలంగా నివేదిక ఇచ్చిందని చెబుతూ కేసుకు ఇంతటితో ‘తెర’ వేస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.