ఆంధ్రప్రదేశ్‌

అమరావతికి వస్తే.. ఐదురోజులే పని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 6: జూన్ లోగా హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాల సౌకర్యం కల్పిస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ తెలియచేశారు. ఉద్యోగుల తరలింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం నారాయణ చర్చించారు. ఆ తరువాత ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వారానికి ఐదు రోజుల పనిదినాలను ఏవిధంగా అమలు చేయాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. ఐదు రోజుల పనిదినాన్ని ఏడాది పాటు అమలు చేయాలనుకుంటున్నామని, అవసరమైతే ఆ తరువాత కూడా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఐదు రోజుల పనిదినాలను అమలు చేసేటప్పుడు కార్యాలయ పని వేళల్లో కూడా మార్పులు ఉంటాయని ఆయన వివరించారు. అమరావతిలో సెక్రటేరియట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని నారాయణ చెప్పారు. ప్రస్తుతానికి రెండు అంతస్తులతో భవన నిర్మాణం జరుగుతోందని, తొలి విడత 4,500 మంది ఉద్యోగులు వస్తున్నారని, ఆ తరువాత విడతల వారీగా మిగిలిన ఉద్యోగులు వస్తారని ఆయన చెప్పారు. హైదరాబాద్ నుంచి 2,200 మంది హెచ్‌ఓడిలు కూడా వస్తున్నారని, వారి కోసం సెక్రటేరియట్‌లో మరో రెండు అంతస్తులను నిర్మిస్తున్నామని నారాయణ తెలియచేశారు. జూన్ మొదటి వారం నుంచి అమరావతి నుంచే పాలన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కూడా జూన్ నుంచి కొత్త సెక్రటేరియట్ నుంచి పాలన సాగిస్తారని ఆయన వివరించారు.