రాష్ట్రీయం

మమ్మల్ని మార్చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: శ్రీనగర్‌లోని ఎన్‌ఐటి (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) పోలీసుల దెబ్బలకు గాయపడిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమను తక్షణం వేరే ఎన్‌ఐటికి తరలించాలని హెచ్‌ఆర్‌డి బృందాన్ని బుధవారం కోరారు. శ్రీనగర్ నుండి కొంతమంది తెలుగు విద్యార్థులు తమ బాధలను టెలిఫోన్‌లో హైదరాబాద్ పాత్రికేయులకు వివరించారు. పది రోజులుగా కాశ్మీర్ విద్యార్థులు, కాశ్మీరేతర విద్యార్ధుల మధ్య కొనసాగుతున్న వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. టి-20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన భారత్ పాక్ మ్యాచ్ సమయంలో భారత్ విజయం సాధించినపుడు ఎన్‌ఐటిలోని కాశ్మీరేతర విద్యార్ధులు సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన వెస్టిండీస్ మ్యాచ్‌లో భారత్ నిష్క్రమణతో కాశ్మీర్‌కు చెందిన విద్యార్ధులు సంబరాలు చేశారు. దానిని ప్రశ్నిస్తూ ఏప్రిల్ 1న కాశ్మీరేతర విద్యార్థులు మువ్వనె్నల జండాలు చేతితో పట్టుకుని ఎన్‌ఐటి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్ద భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ వారు నినాదాలు చేయడంతో పక్క బ్లాకుల్లోని కాశ్మీర్ విద్యార్థులు వచ్చి ‘హమ్ క్యా చాహతే ... అజాదీ’ అంటూ నినాదాలిచ్చారు. పరిస్థితిని గమనించిన ఎన్‌ఐటి డైరెక్టర్ రజత్‌గుప్త క్లాసులను రద్దు చేసి విద్యార్థులను పంపించేశారు. ఏప్రిల్ 4న తిరిగి క్లాసులు ప్రారంభం కాగానే క్యాంపస్‌లో స్థానిక పోలీసులను, సిఆర్‌పిఎఫ్‌ను రంగంలోకి దించారు. ఏప్రిల్ 5న తాజాగా మరోమారు వివాదాలు చెలరేగాయి. కొంతమంది విద్యార్థులు క్యాంపస్ వీడి వెళ్లడానికి ప్రయత్నించడం, క్యాంపస్‌లోనే నిరసన ప్రదర్శనకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుని కొంత మందిని మెయిన్ గేట్ బయటకు తీసుకువచ్చి లాఠీ ఛార్జీ చేశారు. దాంతో చాలా మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చాలా మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే కావడం గమనార్హం. ఈ ఘటనపై విదార్థులు సమాచారం అందించడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
తప్పులేకున్నా చితకొట్టారు: విద్యార్థులు
కాశ్మీరీ విద్యార్థుల తీరుపై ఆందోళన చేపట్టిన తమపై పోలీసులు విచక్షణా రహితంగా లాఠచార్జీ చేశారని తెలుగు విద్యార్ధుల తరఫున హిమవంత్ అనే విద్యార్ధి చెప్పాడు. ఈ విషయాన్ని డైరెక్టర్‌కు చెబితే ఫెయిల్ చేస్తామని బెదిరించారని, లాఠీచార్జీలో 50మందికి తీవ్రగాయాలయ్యాయని, అందులో ఐదుగురు విద్యార్థులు ఐసియులో చికిత్స పొందుతున్నారన్నారు. చాలామంది నడవలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. విద్యార్ధులు అంతా సురక్షితంగానే ఉన్నారని నిట్ డైరెక్టర్ చెబుతున్నా, అందరినీ లోపల కొడుతున్నారని విద్యార్ధులు ఆవేదనగా చెప్పారు. ఎవరినీ లోపలికి రానివ్వడంలేదని, విద్యార్ధినులపైనా లాఠీలు ఝుళిపించారని విద్యార్థులు చెప్పారు. వికలాంగులని కూడా చూడకుండా గదుల్లోకి తీసుకువెళ్లి మరీ కొడుతున్నారని ఎవరేం చేస్తారో చూస్తామంటూ పోలీసులు బెదిరించారని విద్యార్థులు ఆవేదనగా చెప్పారు. తమను శ్రీనగర్ నుండి వేరే నిట్‌కు మార్చాలని హెచ్‌ఆర్‌డికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇద్దరు సభ్యుల బృందం
హెచ్‌ఆర్‌డికి చెందిన ఇద్దరు సభ్యుల బృందం బుధవారం శ్రీనగర్‌కు చేరుకుంది. అందులో డిప్యూటీ డైరెక్టర్ ఫజల్ మహ్మద్, నిట్ చైర్మన్ ఎం జె జరాబి ఉన్నారు. ఈ బృందం మరో వారంపాటు అక్కడే ఉండి విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడి సమగ్ర నివేదిక ఇవ్వనుంది. నిట్‌లో ఘటనలపై నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సిఎం మెహబూబాతో మాట్లాడారు. నిట్ క్యాంపస్‌లోని స్థానిక పోలీసులను తొలగించి, అక్కడ సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని నియమించారు.

chitram...
స్థానికేతర విద్యార్థుల ఆందోళన

శ్రీనగర్ నిట్ వద్ద మోహరించిన సిఆర్‌పిఎఫ్ దళాలు