ఆంధ్రప్రదేశ్‌

మధుర కృష్ణమూర్తి శాస్ర్తీ అస్తమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 6: సుప్రసిద్ధ జ్యోతిష, వాస్తు పండితులు, రాష్టప్రతి అవార్డు గ్రహీత మహామహోపాధ్యాయ మధుర కృష్ణమూర్తిశాస్ర్తీ బుధవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం కృష్ణనగర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 88 ఏళ్ల మధుర కృష్ణమూర్తిశాస్ర్తీకి భార్య, ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ముక్కామలలో 1928 ఫిబ్రవరి 28న జన్మించారు. పీసపాటి విశే్వశ్వరశాస్ర్తీ, వాజపేయుల వెంకటసుబ్రహ్మణ్య సోమయాజీ, శ్రీపాద వెంకటరమణ దైవజ్ఞ శిష్యరికంలో ఆయన జ్యోతిష, వాస్తు, గణిత, సాహిత్య రంగాల్లో శిక్షణపొందారు. తాను నమ్మిన దృక్ సిద్ధాంతాన్ని తుది శ్వాస వరకు పాటించారు. ఇటీవలి గోదావరి పుష్కరాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తాన్ని కాదని తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారం వచ్చిన ముహూర్తానికే ఆయన పుణ్యస్నానం ఆచరించడం విశేషం. జ్యోతిష, దృక్ గణిత సిద్ధాంత ప్రచారానికి విశేషంగా కృషిచేశారు. ఇందుకోసం రాజమహేంద్రవరంలో జ్యోతిష విజ్ఞాన కేంద్రం, విశ్వవిజ్ఞాన ప్రతిష్టానమ్‌ను నిర్వహిస్తున్నారు. అలాగే విశ్వవిజ్ఞాన మాసపత్రికను కూడా మధుర కృష్ణమూర్తిశాస్ర్తీ వెలువరిస్తున్నారు. జ్యోతిష, గణిత, సాహిత్య రంగాల్లో ఆయన చేసిన కృషికి రాష్టప్రతి పురస్కారం, మహామహోపాధ్యాయ బిరుదు అందుకున్నారు. ఇవికాక ఎన్నో పురస్కారాలు, బిరుదులు ఆయనకు లభించాయి. 1981లో తణుకుకు చెందిన నన్నయ్యభట్టారక పీఠం జ్యోతిష విజ్ఞాన భాస్కర బిరుదు, 1985లో నాటి బీహార్ గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య చేతుల మీదుగా కనకాభిషేకం పొందారు. 1983లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రలాజికల్ సొసైటీ ఆధ్వర్యంలో కలకత్తాలో జరిగిన సదస్సులో ప్రసంగించారు. 1980నుంచి 1990 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్యాత్మిక, దేవాదాయశాఖ బోర్డు సభ్యులుగా సేవలందించారు. 1998లో రాజీవ్ విజ్ఞాన పురస్కారం అందుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన భారతీయ విజ్ఞాన సమితి ద్వారా వాస్తుకళానిధి బిరుదును స్వీకరించారు. 1998లో చెన్నై తెలుగు అకాడమీ ద్వారా ఉగాది పురస్కారాన్ని పొందారు. 2000లో తిరుపతి ఆర్‌ఎస్ విద్యాపీఠం డీమ్డ్ యూనివర్శిటీ ద్వారా వాచస్పతి బిరుదు పొందారు. దృక్ గణితంపై కంచికామకోటి పీఠాధిపతి కంచి పరమాచార్య సమక్షంలో నాటి రాష్టప్రతి ఆర్ వెంకటరామన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని లాల్‌బహదూర్‌శాస్ర్తీ సంస్కృతి విద్యాపీఠంలో జరిగిన చర్చలో పాల్గొని ప్రసంగించారు. మధుర కృష్ణమూర్తిశాస్ర్తీ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, జ్యోతిష పండితులు సంతాపం వ్యక్తంచేశారు.