ఆంధ్రప్రదేశ్‌

మంత్రివర్గ విస్తరణ? కొత్తగా 8 మందికి చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ఉగాది తర్వాత ఏ రోజైనా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విస్తరణలో 8 మందికి అవకాశం దక్కుతుందని సమాచారం. అయితే ఇటీవల వైకాపా నుండి టిడిపిలో చేరిన 9 మందిలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఇస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌బాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని పార్టీ నేతలు అంతా డిమాండ్ చేసున్నా చంద్రబాబు వౌనం పాటిస్తున్నట్టు తెలిసింది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబునాయుడు మరికొంత కాలం లోకేష్‌బాబును ‘ఆపరేషన్ వైకాపా’ సేవలకే వినియోగించుకోవాలని చూస్తున్నారని ఆ కారణంగా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేదని చెబుతున్నారు. వైకాపా నేతలను టిడిపిలోకి తీసుకువచ్చే బాధ్యతలను మంత్రులకు అప్పగించి స్వయంగా లోకేష్‌బాబు ఆ వ్యవహారాలను పర్యవేక్షించడం సత్ఫలితాలను ఇస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా మరో నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు సైతం టిడిపిలో చేరనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
మంత్రివర్గ విస్తరణలో ప్రగతి సూచికలు సరిగా లేని కొంత మంది మంత్రుల పదవులకు చెక్ పెడుతున్నట్టు కూడా తెలిసింది. తొలగించే మంత్రులపై ఇంకా స్పష్టత రాకున్నా , పదవులు దక్కేవారి వ్యవహారంలో కొంత స్పష్టత వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణలో పదవులు దక్కేవారిలో కిమిడి కళా వెంకటరావు, కాలవ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర,
మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్టీ కోటాలో సంధ్యారాణి, పతివాడ నారాయణ స్వామి నాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి, గొల్లపల్లి సూర్యారావు, గౌతు శ్యాం సుందర శివాజీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు కూడా రేసులో ఉన్నారు. ఒకపుడు వైఎస్ రాజశేఖరరెడ్డిని ధీటుగా ఎదుర్కొన్న కడప జిల్లా నేత సతీష్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కడప జిల్లా రాజకీయాలను మార్చాలనే ఆలోచనలో సిఎం ఉన్నారని తెలిసింది. ఆయనను మండలి వైస్ చైర్మన్ పదవి నుండి మార్చి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. వీరితో పాటు వైకాపా నుండి తెలుగుదేశంలో చేరిన భూమా నాగిరెడ్డి లేదా ఆయన కుమార్తె అఖిలను మంత్రివర్గంలోకి తీసుకుంటారని తొలుత ప్రచారం జరిగినా, జలీల్‌ఖాన్ పేరు మాత్రమే ప్రముఖంగా వినిపిస్తోంది. జ్యోతుల నెహ్రూ పేరును పరిశీలించే పక్షంలో జలీల్‌ఖాన్‌ను పక్కన పెడతారని సమాచారం. ఈ విస్తరణలో వైకాపా నేతలు ఎవరికీ మంత్రి పదవులు ఇవ్వకుండా దూరంగా ఉంచాలనే ప్రతిపాదన కూడా ఉందని తెలిసింది. దీనికి తెలంగాణలో జరిగిన పరిణామాలనే నేతలు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌పై గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ టిఆర్‌ఎస్‌లో చేరడం ఆయనను మంత్రిగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం నియమించడంపై టిడిపి నేతలే అనేక మార్లు గవర్నర్‌ను కలిసి , స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశాయి. పార్టీకి రాజీమానా చేయాలని టిడిపి నేతలు ఆయనపై వత్తిడి పెంచడం తర్వాత ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో పడిపోయిన సందర్భాన్ని నేతలు ప్రస్తావిస్తున్నారు. వైకాపా నేతలను మంత్రివర్గంలోకి తీసుకుంటే ముందు వారితో రాజీనామా చేయించాలనే డిమాండ్ వస్తుందని, దానిని ఎదుర్కొని ఇబ్బందులు పడే బదులు ఈసారి విస్తరణకు దూరంగా ఉండటం ఉత్తమం అనే యోచన చేస్తున్నారు.
ఉన్నవారిలో స్థాన భ్రంశం లేదా పదవులు చేజారే వారి జాబితాలో గంటా శ్రీనివాసరావు, పీతల సుజాత, కిమిడి మృణాళిని, కింజరాపు అచ్చన్నాయుడు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిని మంత్రివర్గంలో కొనసాగించి శాఖలు మారుస్తారా అనేది కూడా ఇంకా తేలలేదు.
మరో పక్క కొత్తగా పార్టీలోకి వచ్చిన రావెల కిశోర్‌బాబు లాంటి వారిని మంత్రివర్గంలోకి తీసుకుని చంద్రబాబు అందరికీ షాక్ ఇచ్చారు. మరో పక్క విద్యాసంస్థల అధిపతి డాక్టర్ నారాయణకు అత్యంత కీలక పదవిని ఇవ్వడంతో నెల్లూరు జిల్లా నేతలు అవాక్కయ్యారు. యనమల, అయ్యన్నపాత్రుడు, కెఇ కృష్ణమూర్తిలకు మంత్రిపదవులను ఇచ్చిన చంద్రబాబునాయుడు వారితో సమకాలికుడైన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మాత్రం పదవి ఇవ్వకపోవడం అన్యాయమనే భావన ఆ జిల్లాలో వ్యక్తమవుతోంది.

పదవులు ఆశిస్తున్న వారు
కిమిడి కళా వెంకటరావు
కాలవ శ్రీనివాసులు
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
పయ్యావుల కేశవ్
గాలి ముద్దుకృష్ణమనాయుడు
ధూళిపాళ్ల నరేంద్ర
మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి
నందమూరి బాలకృష్ణ
నారా లోకేష్
ఎస్టీ కోటాలో సంధ్యారాణి
పతివాడ నారాయణ స్వామి నాయుడు
బండారు సత్యనారాయణ మూర్తి
గొల్లపల్లి సూర్యారావు
గౌతు శ్యాం సుందర శివాజీ
గోరంట్ల బుచ్చయ్య చౌదరి
పదవులు మారే వారు
కిమిడి మృణాళిని
పీతల సుజాత
గంటా శ్రీనివాసరావు
కింజరాపు అచ్చన్నాయుడు