ఆంధ్రప్రదేశ్‌

కొలిక్కిరాని ‘విభజన’ పేచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మరో రెండు నెలల్లో రెండు సంవత్సరాలు కావస్తున్నా, ఇంతవరకు 9,10 షెడ్యూళ్లలోని వందకుపైగా సంస్థల విభజన కొలిక్కి రాలేదు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థల విభజన ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. కేంద్ర హోంశాఖ కూడా ఇరు రాష్ట్రాలు ఈ రెండు షెడ్యూళ్లలోని సంస్థల విభజనను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఉన్నత విద్యా మండలి డిపాజిట్ల విషయంలో గత నెలలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తుందని, కోర్టు మార్గదర్శకాల మేరకు నడుచుకుందామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో వివాదాల పరిష్కార కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీకి హాజరైన తెలంగాణ ఆర్థిక శాఖకు చెందిన సీనియర్ అధికారి రాష్ట్రప్రభుత్వ వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు వివరించారు. సుప్రీం తీర్పు కేవలం ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకానికి మాత్రమే పరిమితమని, 9,10 షెడ్యూళ్లలో పేర్కొన్న అన్ని సంస్థలకు వర్తించదని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కేవలం నగదు నిల్వలు మాత్రమే పంచుకోవాలని ఉందని, అంతే కాని స్థిరాస్తులను కాదని తెలంగాణ ప్రభుత్వం స్థిరాభిప్రాయంతో ఉంది. ఏపి ప్రభుత్వం మాత్రం ఉన్నత విద్యామండలి ఆస్తుల విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పు 9,10 షెడ్యూల్స్‌లోని ప్రభుత్వ రంగ సంస్ధలకు వర్తిస్తుందని కేంద్రానికి తెలిపింది. ఆస్తుల విభజన తేలిన తర్వాత ఉద్యోగుల పంపకం చేపట్టాలని ఏపి తన వాదనలను కేంద్రానికి తెలియచేసింది.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ రంగ సంస్ధలు, సొసైటీలు, కార్పోరేషన్లు, సహకార సంస్ధలకు బ్యాంకుల్లో 16వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. అలాగే వీటికి ఉన్న సొంత భవనాల విలువ అంచనా ప్రకారం రూ.70 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఉన్నత విద్యామండలి డిపాజిట్లు, ఆస్తుల విషయంలో జనాభా నిష్పత్తి 58:42 ప్రకారం పంచుకోవాలని కోర్టు సూచించింది. ఇదే సూత్రం వర్తింపచేసి అన్ని ప్రభుత్వ రంగ సంస్ధలు, వివిధ కార్పోరేషన్లలో వాటా కోరాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ అంశాలపై హోంశాఖ నిర్వహించిన సమావేశానికి రెండు రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ రంగ సంస్ధల ఆస్తులు, సిబ్బంది విభజనకు షీలా బేడీ కమిటీని కేంద్రం 2014లో నియమించింది. ఈ కమిటీ కాలపరిమితి గత ఏడాది ఆగస్టులో ముగిసింది. దీంతో ఆర్టీసితో సహా అనేక సంస్ధల విభజనలో సమస్యలు తలెత్తుతున్నాయి. షీలాబేడీ కమిటీ 59 సంస్ధలను మాత్రమే విభజించింది. షీలా బేడీ కమిటీని పొడిగించాల్సిన అవసరం లేదని, ఆ కమిటీ అనుసరించిన విధానాలను అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఏపి స్ధానికత ఉన్న విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేయడం వివాదాలకు దారితీసింది. ప్రస్తుతం కోర్టు తీర్పు మేరకు రెండు రాష్ట్రాలు వేతనాలు జనాభా నిష్పత్తి మేరకు చెల్లిస్తున్నాయి.