రాష్ట్రీయం

ఆదాయ పన్ను వసూళ్లలో.. లక్ష్యాన్ని అధిగమించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి రూ. 36,663 కోట్ల ఆదాయం పన్నును గత ఆర్థిక సంవత్సరానికి వసూలు చేసినట్లు ఆదాయంపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బాబు ప్రకటించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 15.4 శాతం ఎక్కువగా ఆదాయం పన్నును వసూలు చేశామన్నారు. వాస్తవానికి రూ. 36,251 కోట్లు వసూలుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో కార్పోరేట్ పన్ను రూ. 21,382 కోట్లు, ఆదాయం పన్ను రూ. 15,281 కోట్లు ఉందన్నారు.
గురువారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, అడ్వాన్స్ పన్ను చెల్లింపులు ఎన్‌ఎండిసి, ఎస్‌బిహెచ్, ఆంధ్రా బ్యాంకు నుంచి ఆశించినట్లుగా లేనందు వల్ల రూ. 2042 కోట్లు తగ్గినా, టిడిఎస్, రెగ్యులర్ ట్యాక్స్ విభాగంలో రికార్డు స్థాయి వసూళ్లు చేశామన్నారు. టిడిఎస్ వసూళ్లు గత ఏడాది రూ. 17,662 కోట్లు చేశామన్నారు. అంతకు ముందు కంటే 18.7 శాతం ఎక్కువన్నారు. గత ఏడాది 37 చోట్ల సోదాలు, 37 చోట్ల సర్వేలు నిర్వహించామన్నారు. ఐటి శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇనె్వస్టిగేషన్ ఆధ్వర్యంలో ఈ సోదాలు చేపట్టామన్నారు. సోదాల్లో రూ.1194 కోట్లు, సర్వేల్లో రూ.880 కోట్లు కలిపి రూ.2074 కోట్లు కనుగొన్నామన్నారు. దీనికి సంబంధించి పన్నులను వసూలు చేశామన్నారు. ఇందులో భాగంగా పలు చోట్ల నగదు, ఆభరణాలు రూ. 27 కోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఫార్మా, మైనింగ్, పౌల్ట్రీ, వౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో సోదాలు, సర్వేలు చేశామన్నారు. దీంతో పాటు ఇనె్వస్టిగేషన్ డైరెక్టరేట్ 340 చోట్ల సర్వేలు నిర్వహించి రూ. 839 కోట్లను కనుగొన్నామని, వీటికి సంబంధించి పెనాల్టీలు విధించి పన్నును వసూలు చేశామన్నారు.
పన్ను ఎగవేతదారులపై 36 కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్ ప్రక్రియ చేపట్టామన్నారు. రాష్ట్రంలో పన్ను చెల్లింపు దారులు 23,23,802 మంది ఉన్నారన్నారు. గత ఏడాది కొత్తగా 4,83,398 మంది పన్నులు చెల్లించారన్నారు. ఆన్‌లైన్ ద్వారా పన్ను చెల్లింపుల సంఖ్యలో 31.87 శాతం వృద్ధిరేటు నమోదైందన్నారు. ఆదాయం సముపార్జనపై వివరాలు సరిగా లేకపోతే, 45 శాతం పన్నును చెల్లించాలన్నారు. ఈ ఆదాయం వెల్లడించినప్పటి నుంచి రెండు నెలల్లోగా పన్నులు చెల్లించాలన్నారు.