రాష్ట్రీయం

ఎస్‌ఐ ఉద్యోగాలకు 17న రాత పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నెల 17న ఎస్‌ఐ నియామకాలకు రాత పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా, ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు దరఖాస్తులు స్వీకరించిన బోర్డు ప్రాథమిక రాత పరీక్షను ఈ నెల 17వ తేదీ ఆదివారం అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలు, పట్టణాలు, నగరాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థులు హాల్‌టిక్కెట్లను ఈ నెల 9 నుంచి 15వ తేదీ అర్ధరాత్రి వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. హాల్‌టిక్కెట్ రెండో పేజీలో ఉన్న సూచనలను పూర్తిగా చదవాలని కోరింది. పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని తెలిపింది.