రాష్ట్రీయం

అంబేద్కర్ సేవలు నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 14: సమాజ హితం కోసం తన మేధోసంపత్తిని ధారపోసి, నవ సమాజ నిర్మాణానికి నాంది పలికిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలు నిరుపమానమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఇక్కడ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాష్టస్థ్రాయి వేడుకలు సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు కోలా భాస్కర్ అధ్యక్షతన జరిగాయి. ముఖ్యఅతిథిగా సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ సమాజంలో కుల వివక్ష, అంటరానితనం పోవాలంటే విద్య ఒక్కటే మార్గమని చాటిచెప్పిన మహోన్నత నేత అంబేద్కర్ అని నివాళి అర్పించారు. నాడు సమాజంలో ఉన్న పరిస్థితులను తట్టుకుని విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడంతో పాటు భారత రాజ్యాంగాన్ని రచించి, దేశ విదేశీ మేధావుల ప్రశంసలు పొందారని గుర్తుచేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రావత్ మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత చరిత్ర తెలియనివారు ప్రపంచంలో ఉండరంటే అతిశయోక్తి కాదన్నారు. కులవివక్షకు గురైనప్పటికీ సవాళ్లను దీటుగా ఎదుర్కొని భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసిన కృషిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత నేత అంబేద్కర్ అని కొనియాడారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ ఎందరికో స్ఫూర్తిప్రదాత అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ హితం కోసం ఐఏఎస్ అధికారిగా ఎస్‌ఆర్ శంకరన్ చేసిన కృషిని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆయన సేవలకు గుర్తుగా కలెక్టరేట్‌లో నిర్మించిన సమావేశ మందిరానికి ఎస్‌ఆర్ శంకరన్ పేరు పెట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ సుబ్బారావు, రూరల్, అర్బన్ ఎస్పీలు ఎస్వీ రాజశేఖరబాబు, సీహెచ్ విజయారావు మాట్లాడుతూ సామాజికవేత్తగా అనేక ఉద్యమాలు నడిపి బడుగు, బలహీన వర్గాల హక్కులను రాజ్యాంగంలో పొందుపర్చిన మహనీయుడు అంబేద్కర్ అని నివాళి అర్పించారు. తొలుత లాడ్జి సెంటర్‌లోని డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ బీ లత్కర్, దళిత, గిరిజన సంఘాల నాయకులు గోళ్ల అరుణ్‌కుమార్, చంద్రానాయక్, పప్పుల దేవదాసు, మేడిద బాబురావు, జల్ది ఇస్మాయిల్, చార్వాక పాల్గొన్నారు.

చిత్రం... గుంటూరులో ఆదివారం జరిగిన అంబేద్కర్ జయంతి సభలో ప్రసంగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం