రాష్ట్రీయం

అగ్నిగుండంగా మారిన ఆంధ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 14: ఆంధ్ర రాష్ట్రం అగ్నిగుండంగా మారుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్నాయి. దీని ప్రభావం విద్యుత్ వాడకంపై తీవ్రంగా చూపుతోంది. రోడ్డెక్కేందుకు జనం భయపడుతున్నారు. ఇవి మరికాస్త పెరగవచ్చని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం పేర్కొంది. ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా తిరుపతి, అనంతపురం జిల్లాలకు సంబంధించి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జంగమహేశ్వరపురంలో 42.2 డిగ్రీలు, కర్నూలు-42, నందిగామ-41.5, కళింగపట్నం-34, తుని-40, కాకినాడ-38, నర్సాపూర్-36, గన్నవరం-40, మచీలీపట్నం-36, బాపట్ల-34, ఒంగోలు-37, కావలి-38, నెల్లూరు-39 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదయ్యాయి. విశాఖపట్నంలో 39డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. శనివారం కంటే కూడా మరో డిగ్రీ అదనంగా పెరిగింది. సాధారణం కంటే కూడా మూడు డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం పేర్కొంది. తునిలో నాలుగు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా పెరిగాయని ఈ కేంద్రం వివరించింది. ఉష్ణోగ్రతల తీవ్రత, తీవ్ర ఉక్కపోత ఉంటోంది.
60ఎంయూకి మించిన విద్యుత్...
ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబందించి 58 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటి ద్వారా రోజుకీ 60 మిలియన్ యూనిట్ల (ఎంయు) నుంచి 64 ఎంయూకి విద్యుత్ వాడకం పెరుగుతోంది. ఎండల తీవ్రతను బట్టి ఇది కూడా మరికొంత మేర పెరిగే అవకాశాలున్నట్టు సంస్థ వర్గాలు చెబుతున్నాయి. సౌరశక్తి, గాలి విద్యుత్ ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వస్తున్నందున విద్యుత్ సమస్యలు తలెత్తడం లేదని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో పరిశ్రమలు అత్యధికంగా కలిగి ఉన్న విశాఖ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ప్రతిరోజు 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం ఉంటుండగా, గత మార్చి నుంచి ఐదు జిల్లాలకు సంబంధించి 58ఎంయు నుంచి క్రమేపీ పెరుగుతూ దాదాపు 64 మిలియన్ యూనిట్లకు చేరుకుంది.

చిత్రం... విశాఖ చినవాల్తేర్ వద్ద గొడుగుల రక్షణలో వెళ్తున్న చిన్నారులు