రాష్ట్రీయం

నేడు కర్నాటకలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 14: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం కర్నాటకలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన కనీస విశ్రాంతి కూడా తీసుకోకుండా రెండు రోజులు ఢిల్లీలో పర్యటించారు. సోమవారం కర్నాటకలోని మాండ్య జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా మాజీ ప్రధాని దేవెగౌడ ఎన్నికల ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు దేవెగౌడ మనవడు, ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌కు మద్దతుగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. నిఖిల్ జేడీఎస్ అభ్యర్థిగా మాండ్య పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా, అదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన సినీనటి సుమలత పోటీ చేస్తున్నారు. ఒక్క మాండ్యలోనే కాకుండా బీజేపీకి వ్యతిరేకంగా కర్నాటకలో తెలుగువారు అధికంగా ఉండే మరికొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారు.