రాష్ట్రీయం

పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు నేడు స్క్రీనింగ్ టెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్ 4,3) సర్వీస్ ఉద్యోగాలకు ఈ నెల 21, ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే వౌర్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు 13 జిల్లాల్లో 1320 పరీక్షా కేంద్రాల్లో 1051 పోస్టులకు 4,95,526 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆదివారం ఉదయం 10 గం. నుండి 12.30 గం. వరకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్లతో పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని ఉదయం 9 గం. నుండి 9.30 గం.
మధ్య పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. 15 నిమిషాల గ్రేస్ పిరియడ్ వరకు అంటే 9.45 లోపు వచ్చిన వారిని కూడా అనుమతిస్తారన్నారు. పరీక్ష హాల్‌టిక్కెట్‌తో పాటు అభ్యర్థి ఫొటోతో కూడిన ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాస్‌పోర్టు, ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగి ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఏదైనా ఒక ఒరిజినల్ కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. పరీక్ష హాల్‌లో అభ్యర్థికి ఇచ్చే ఓఎంఆర్ షీట్‌లో అభ్యర్థి పేరు, హాల్ టిక్కెట్ నెంబర్, పరీక్ష కేంద్రం వివరాలు రాసి సర్కిల్స్‌ను (బబుల్స్) పూర్తిగా బ్లూ లేదా బ్లాక్ పెన్‌తో దిద్దాలన్నారు. అదే విధంగా టెస్ట్ బుక్‌లెట్ సిరీస్‌ను పూర్తి చేసి సర్కిల్స్ దిద్దాలన్నారు. అసంపూర్తిగా పూర్తి చేసిన టెస్ట్ బుక్‌లెట్ సిరీస్‌లు పరిగణలోకి తీసుకోరన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులైన సెల్యులార్ ఫోన్లు, క్యాలుక్యులేటర్లు పరీక్ష హాల్‌లోకి అనుమతించబోరని స్పష్టం చేశారు. దివ్యాంగులకు అనుమతించిన మేర అదనపు సమయం ఇవ్వడంతోపాటు స్క్రెబ్ (సహాయకుడు)ను అవసరం మేర అనుమతిస్తారన్నారు. ప్రతి తప్పు సమాధానికి 1/3 మార్కు (నెగిటివ్ మార్కు) తీసివేస్తారని తెలిపారు.