రాష్ట్రీయం

ఏపీ, తెలంగాణ హైకోర్టులకు త్వరలో కొత్త న్యాయమూర్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో న్యాయమూర్తుల నియామకం పూర్తి చేసేందుకు కసరత్తు జరగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల కోర్టుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణలో లక్ష 93వేల కేసులు, ఆంధ్రాలో లక్ష 73వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, పెండింగ్‌లో ఉన్న కేసులను న్యాయపరంగా సత్వరమే పరిష్కరించాలని ఆయన సూచించారు. యువ న్యాయవాదులకు కేసుల్లో వాదించేందుకు ఇదో మంచి తరుణమని అన్నారు. హైకోర్టు భవన శతవార్షికోత్సవం శనివారం నాడు ఘనంగా జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ హైకోర్టుతో తనకు 31 సంవత్సరాల అనుభవం ఉందని జస్టిస్ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. ఇది చాలా ఎమోషనల్ డే, తన సగం జీవితం ఈ కోర్టులోనే గడిచిందని అన్నారు. తన పుట్టింటికి తాను ఈ రోజు వచ్చినందుకు
చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం కృషి చేస్తానని అన్నారు. హైకోర్టు ఇతర సమస్యలు కూడా త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ స్వాగతం పలుకగా, తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీ దామోదర్‌రెడ్డి , తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ నర్సింహారెడ్డి, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ మాట్లాడారు. ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్, ఉత్తరాఖండ్ హైకోర్టు సీజే జస్టిస్ రమేష్ రంగనాధ్, జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు తమ అనుభవాలను పంచుకున్నారు. న్యాయవ్యవస్థ ప్రయాణం ముందున్న మార్గం అనే అంశంపై జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడారు. తొలుత జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ మాట్లాడుతూ చారిత్రాత్మక హైకోర్టు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అత్యంత పురాతన అద్భుత భవనంలో హైకోర్టు పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, హైకోర్టు క్యాంపస్ వాతావరణం న్యాయవాదులకు చాలా అనుకూలంగా ఉందని అన్నారు. వీలైనంత త్వరగా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని, సామాన్యులకు న్యాయం అందేలా చూస్తామని పేర్కొన్నారు. చివరిలో జస్టిస్ వీ రామసుబ్రమణియన్ వందన సమర్పణ చేశారు.

చిత్రం... తెలంగాణ హైకోర్టు భవన శతవార్షికోత్సవాలను ప్రారంభిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎన్‌వీ రమణ