రాష్ట్రీయం

టీటీడీ బంగారం తరలింపులో లోపాలు నిజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: టీటీడీ బంగారం తరలింపులో కొన్ని లోపాలు ఉన్నమాట నిజమేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. టీటీడీ బంగారం తరలింపు వ్యవహారంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ నివేదిక ఇచ్చారని.. లోపాలు ఉన్నట్టు గుర్తించారని అన్నారు. పెద్దమొత్తంలో బంగారం తరలించే సమయంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాల్సి ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారన్నారు. బ్యాంక్, టీటీడీ అధికారులు అజాగ్రత్తగా వ్యవహరించాల్సింది కాదని.. శ్రీవారి బంగారంతో భక్తుల మనోభావాలు ముడిపడి ఉంటాయన్నారు. ఈ బంగారం తరలింపు వ్యవహారంపై జరిగిన విచారణ నివేదికను ముఖ్యమంత్రికి పంపామని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహించడంలో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాజకీయ నేతలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, ఈ విషయమై స్పష్టమైన నిబంధనలున్నాయని సీఎస్ గుర్తుచేశారు.