రాష్ట్రీయం

తిరుమలాయపాలెం జడ్పీటీసీకి 106 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడం ఇంతకాలం చూశాం. కానీ పార్టీ విధానాలకు నిరసనగా నామినేషన్లు దాఖలు చేయడం దేశంలోనే తొలిసారిగా జరిగింది. తెలంగాణలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ నేతల వైఖరికి నిరసనగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం జడ్పీటీసీ స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ స్థానం జనరల్‌కు కేటాయించడంతో మొత్తం 106 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో వివిధ పార్టీలకు చెందిన వారు ఆరుగురు కాగా, మిగిలిన 100 మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలే. తిరుమలాయపాలెం జడ్పీటీసీ స్థానం జనరల్‌కు కేటాయించడంతో పార్టీలో ప్రధాన నేతలుగా ఉంటూ ఆది నుంచి పనిచేసిన నరేష్‌రెడ్డి, వేణుగోపాల్, లక్ష్మయ్య లాంటి వారు టికెట్ ఆశించారు. కానీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించిన కాంగ్రెస్ నేత కందాల ఉపేందర్ రెడ్డి తరువాత టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను టీఆర్‌ఎస్ అధిష్టానం ఆయనకే అప్పగించింది. దీంతో ఎమ్మెల్యే కందాల తన బంధువైన కందాల క్రాంతికుమార్‌కు తిరుమలాయపాలెం జడ్పీటీసీ స్థానం కేటాయించారు. దీన్ని వ్యతిరేకిస్తూ తిరుమలాయపాలెం మండలంలోని టీఆర్‌ఎస్ నేతలంతా నామినేషన్లు దాఖలు చేశారు. ప్రతి గ్రామం నుంచి కనీసం ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. అయితే నామినేషన్లు వేసేవారిని వారించే పరిస్థితి కూడా లేకుండాపోయింది. జిల్లా స్థాయి నేతలు నామినేషన్లు వేయవద్దని విన్నవిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు కోసమే ప్రయత్నించామని, ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చినవారు అధికారం చెలాయిస్తామంటే ఊరుకోబోమని, స్వతంత్రంగా బరిలో ఉంటామని హెచ్చరించడంతో వారు వెనుదిరిగారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకున్నప్పటికీ నామినేషన్లు వేసిన నేతలు పట్టించుకోక పోవడం గమనార్హం. ఇదే పరిస్థితి కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలాల్లోనూ కనిపించింది. అయితే ఆ మండలాల్లో టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థులుగా ఒకరిద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులుగా ఎమ్మెల్యే కందాల తన అనుచరులకు మాత్రమే బీ-్ఫరాలు అందించడంతో తాము స్వతంత్రంగా బరిలో ఉంటామంటూ సీనియర్ నేతలు భీష్మించారు. మరోవైపు వీరు చివరి వరకు పోటీలో ఉంటామంటే మద్దతిచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు కూడా ముందుకొచ్చాయి. తమ పార్టీలో చేరకపోయినా మద్దతిస్తామంటూ విపక్ష పార్టీల నేతలు ముందుకు రావడం విశేషం. టీఆర్‌ఎస్ అధికారిక అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని సైతం వారు ప్రకటించారు.